‘చంద్రకళ’గా భయ పెట్టబోతున్న హన్సిక (ఫోటోస్)
హైదరాబాద్: ‘చందమామ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సి.కళ్యాణ్ ఇపుడు గ్లామర్ స్టార్ హన్సిక ప్రధాన పాత్రలో ‘చంద్రకళ' అనే భారీ చిత్రాన్ని సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బేనర్ పై సమర్పిస్తున్నారు. తమిళంలో సెన్నేషనల్ హిట్ అయిన ‘అరన్మణి' చిత్రాన్ని ‘చంద్ర కళ' పేరుతో శ్రీశుభశ్వేత ఫిలింస్ బేనర్ పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
‘అరన్మణి' తెలుగు రైట్స్ కోసం చాలా మంది పోటీపడినప్పటికీ భారీ ఆఫర్ ఇచ్చి సి.కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం గురించి సి.కళ్యాణ్ మాట్లాడుతూ..‘తమిళంలో ఇప్పటికే 24 కోట్లకుపైగా కలెక్ట్ చేసి సంచలన విజయం సాధించిన ‘అరన్మణి' తెలుగులో చాలా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి రైట్స్ తీసుకున్నాను' అని తెలిపారు.
స్లైడ్ షోలో ‘చంద్ర కళ' సినిమాకు సంబంధించిన ఫోటోలు....

హారర్ అండ్ థ్రిల్లింగ్
గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇస్తూ హారర్ టచ్ తో చాలా థ్రిలింగ్ గా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్.

హైదరాబాద్ లోనే షూటింగ్
పూర్తిగా హైదరాబాద్ లోనే నిర్మించిన సినిమా ఇది. ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు.

సినిమా, ఆడియో రిలీజ్
డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఆడియో రిలీజ్ చేసి డిసెంబర్ మూడో వారంలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చందమామ తర్వాత మా బేనర్లో ఇది మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది' అన్నారు.

నటీనటులు
హన్సిక, విమల్, లక్ష్మీరాయ్, ఆండ్రియా, సుందర్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, సంతానం నటించారు.

తెర వెనక
ఈ చిత్రాన్ని సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ పెద్ద ఎస్సెట్ అయింది. సి.కె.ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి పాటలు: వనమాలి, మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి, సంగీతం: కార్తీక్ రాజా, భరద్వాజ్, ఫోటోగ్రఫీ: సెంథిల్ కుమార్, ఫైట్స్: దినేష్, డాన్స్: రాజు సుందరం, గాయిత్రి రఘురాం, శివశంకర్, సహ నిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుందర్ సి.


Click it and Unblock the Notifications











