twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేంటి 'అరుంధతి' చిత్రం గుర్తుకు వస్తోంది?

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇది హర్రర్ చిత్రాల సీజన్. తెలుగు,తమిళ భాషల్లో ముఖ్యంగా హర్రర్ కామెడీలు వరస పెట్టి తెరకెక్కుసుతన్నాయి. ఆడుతున్నాయి. అదే కోవలో హన్సిక హీరోయిన్ గా ఓ హర్రర్ కామెడీ తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రం పోస్టర్స్ తెలుగులో వచ్చి హిట్టైన అరుంధతిని గుర్తు చేయటం విశేషం.

    సుందర్ సి తెరకెక్కిస్తున్న సినిమాలో అతీతశక్తులున్న తమిళ పల్లెటూరి యువతి పాత్ర వేస్తోంది. ఆ పాత్ర చాలా కష్టమైనప్పటికి తనకు చాలా నచ్చిందని హన్సిక చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, సంతానం తదితరులు నటిస్తున్నారు. హర్రర్ కామెడి రూపంలో సాగే ఈ సినిమాను తమిళనాడులో తెరకెక్కించారు. తెలుగులోనూ డబ్బింగ్ అయ్యే అవకాసం ఉంది.

    ఈ చిత్రం పేరు ... అరణ్మనై. సుందర్ సి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియ, లక్ష్మీరాయ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాస్యనటుడు సంతానం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో నిజ దెయ్యం వినికిడి చేసిందే అంశం నెట్‌లో ఆ మధ్యన కలకలం సృష్టిచింది.

    దర్శకుడు సుందర్ సి స్పందిస్తూ తన చిత్రాల్లో కథ పెద్దగా ఉండదు. కామెడీ మాత్రం ఫుల్‌గా ఉంటుందని తెలిపారు. సాధారణంగా మహిళలు, పిల్లలు టీవీల్లో దెయ్యం చిత్రాలనే ఆసక్తిగా చూస్తున్నారన్నారు. అందుకే దెయ్యాల నేపథ్యంలో రూపొందిన చంద్రముఖి, కాంచన వంటి చిత్రాలు పెద్ద విజయం సాధించాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరహాలో రూపొందిస్తున్న హార్రర్ చిత్రమే అరణ్మనై అని తెలిపారు.

    Hansika's Scary Poster

    ఈ చిత్ర షూటింగ్‌ను హైదరాబాద్‌లో వేసిన ఒక బూత్‌బంగ్లా సెట్‌లో అధికభాగం నిర్వహించామని చెప్పారు. ఒక సన్నివేశాన్ని చిన్న పిల్లాడు ఎదురుగా ఎవరు లేకుండానే తనలో తానే మాట్లాడుకుంటాడన్నారు. ఆ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఎవరో పెద్దగా నిట్టూర్చిన శబ్దం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటర్ గ్రహించారని తెలిపారు. అయితే అది నిజ దెయ్యం చర్యనా లేక ఏదైనా శబ్దమా? అన్నది తెలియలేదన్నారు. దీనికి ఆధారం మాత్రం తన వద్ద ఉందని దర్శకుడు సుందర్ సి పేర్కొన్నారు.

    English summary
    Aaranmayi is said to be a horror film and take a glance at the latest poster featuring Hansika in it. No doubt, its a spine chilling experience for Hansika, who has enjoyed all the glamour roles till now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X