హన్సిక, తన సినిమా గురించి షాకింగ్ న్యూస్..
దేశ ముదురు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ హన్సిక. నటన విషయంలో పెద్దగా మార్కులు పడక పోయినా...అందచందాల విషయంలో మంచి మార్కులే కొట్టేసిందీభామ. ఈ సుత్తి విషయాల గురించి పక్కన పెడితే... ఏ హీరోయిన్ అయినా తను చేసిన సినిమాలు థియేటర్లో చూసి తన నటన ఏవింధంగా ఉంది, ప్రేక్షకుల స్పందన ఎలాంటి ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే హన్సిక మాత్రం ఇలాంటి విషయాలపై ఓ షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. ఈవిడగారు తను నటించిన సినిమాలు అసలు చూడనే చూడదట. ఈ విషయాన్ని హన్సికే స్వయంగా తన ట్విట్టర్‌లో పేర్కొంది. మరి ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తావు అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నకు పలువురు హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల పేర్లు చెప్పుకొచ్చింది.
హన్సిక వ్యాఖ్యలకు అభిమానుల నుంచి రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. అందులో కొన్ని మేం చెప్పడానికి వీలుకుండా ఉన్నాయండీ బాబు. హన్సిక తన సినిమా చూసనా, చూడక పోయినా మనకేమీ ఒరిగేదేమీ లేదుగానీ....ప్రస్తుతం హన్సిక సిద్ధార్థ హీరోగా వస్తున్న 'ఓ మై ఫ్రెండ్" సినిమాలో నటిస్తోంది. నవంబర్ 11న ఈ సినిమా విడుదల కాబోతోంది..అదండీ మ్యాటరు.


Click it and Unblock the Notifications











