ట్విట్టర్ లో హన్సిక తిట్టిపోసింది

By Srikanya

హైదరాబాద్ : సెలబ్రెటీల ట్విట్టర్ ఎక్కౌంట్స్ హ్యాక్ చేయటం ఈ మధ్యన చాలా కామన్ గా మారిపోయింది. హన్సిక ఎక్కౌంట్ ని గతంలో నాలుగు సార్లు హ్యాక్ చేసారు. ఇది ఐదోసారి..ఆమె ఎక్కౌంట్ ని హ్యాక్ చేయటం. ఈ విషయంపై ఆమె మండిపడుతోంది. నా పాస్ వర్డ్ ని హ్యాక్ చేస్తే వీళ్లకు ఏం ఆనందం వస్తుందో దేముడుకే తెలియాలి అని ఆమె వాపోయింది. ఆమె గంటలోపలే తనుకు తెలిసిన ఫ్రొఫెషినల్స్ ని రంగంలోకి దించి హ్యాకింగ్ నుంచి బయిటపడింది.

ఇటీవల హన్సికకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. దర్శకులు కొత్త కథలు వినిపిస్తామంటూ వెంటపడుతున్నారట. వరస ఆఫర్స్ తో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇన్నాళ్ళూ బొద్దు పాపలాగ ఉందని ప్రక్కన పెట్టినవాళ్లంతా ఆమె సన్నబడటంతో సై అంటూ ముందుకు దూకుతున్నారు. పట్టుబట్టి మరీ బరువు తగ్గి తన అందాలకు పదును పెట్టిన హన్సిక మళ్లీ పీక్‌టైమ్‌లోకి చేరిందని అంటున్నారు సినీ జనం.

ఆ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ ''అవును, నేను రోజూ అయిదారు కథల్ని వింటున్నాను. వాటిలో నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకొంటున్నా. కథల ఎంపికలో పరిణతి ప్రదర్శిస్తున్నా. గతంతో పోలిస్తే... తక్కువ తప్పులు చేస్తున్నాను. చేస్తున్న చాలా చిత్రాలు మంచి ఫలితాల్ని తెస్తున్నాయి''అని చెప్పుకొచ్చింది. అయితే సన్నబడటం వల్లే ఆఫర్స్ వస్తున్నాయట కదా? అని అడిగితే... ''అది పూర్తిగా అబద్ధం. బొద్దుగా ఉన్నప్పుడు బోలెడన్ని సినిమాలు చేశాను. ఇలా నాజూగ్గా తయారయ్యాక కూడా సినిమాలు చేస్తున్నా. బరువు నాకు ఎప్పుడూ సమస్య కాలేదు'' అని చెప్పుకొచ్చింది.

పెళ్లి గురించి మాట్లాడుతూ ''నా చేతినిండా సినిమాలున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నా. ఇక పెళ్లికొచ్చిన తొందరేముంది చెప్పండి? ఇంకా నా వయసు ఇరవై రెండే కదా?'' అని చెప్పుకొచ్చింది. హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.

'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X