హన్సిక 'సీతారాముల కళ్యాణం' రిలీజ్ ఎప్పుడంటే...
నితిన్, హన్సిక కాంబినేషన్లో రెడీ అవుతున్న 'సీతారాముల కళ్యాణం.. లంకలో' చిత్రం సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 19న విశాఖపట్టణంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సంగతిని నిర్మాత విజయప్రసాద్ తెలియజేస్తూ "ఈ చిత్రంలో నితిన్ ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇది టైటిల్‌కి తగ్గట్లు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. 'లంకలో' అనే ట్యాగ్‌లైన్ వల్ల సినిమాకి లైఫ్ వచ్చింది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో ఐదు పాటలున్నాయి. వినేందుకే కాదు, చూసేందుకు కూడా ఈ పాటలు చాలా బాగున్నాయి. ఈ నెలలో ఆడియోను ఆవిష్కరించి, సంక్రాంతి కానుకగా జనవరి ప్రథమార్థంలో సినిమాను విడుదల చేయాలని సంకల్పించాం'' అని చెప్పారు.
ఇక దర్శకుడు ఈశ్వర్ మాట్లాడుతూ "సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకముంది. సీత కోసం ఆ రాముడు లంకకు వెళితే, ఈ రాముడు తన ప్రియురాలి కోసం లంకకు వెళ్లి ఏం చేశాడనేది ఆసక్తికరం. ఈ సినిమాతో నితిన్ హీరోగా టాప్ రేంజికి వెళతారనే నమ్మకం ఉంది" అన్నారు. నితిన్, హన్సిక తొలి కాంబినేషన్ లో వెల్‌ఫేర్ క్రియేషన్స్ పతాకంపై డా. విజయప్రసాద్ మళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈశ్వర్ ఈ చిత్రానికి దర్శకుడు. చివరగా రెండు పాటల్ని అరకు, వైజాగ్‌లలో నితిన్, హన్సికలపై చిత్రీకరించారు.
ఇక హన్సిక..కళ్యాణ్ రామ్ చిత్రం జయీభవ తర్వాత చేస్తున్న చిత్రం. జయీభవ కూడా ఫెయిల్యూర్ అయింది. దర్శకుడు ఈశ్వరరెడ్డి ఇంతకు ముందు అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రమ్ శీకాకుళం చిత్రం రూపొందించాడు. ఆ చిత్రం బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక నిర్మాతలు కూడా సిద్దు ప్రమ్ శీకాకుళం నిర్మించిన వారే కావటం విశేషం.


Click it and Unblock the Notifications











