దిల్ రాజు సినిమాలోకి హన్సిక కూడా వచ్చి చేరింది

By Srikanya

దిల్ రాజు, సిద్దార్ద కాంబినేషన్ లో రూపొందనున్న ఓ మై ప్రెండ్ చిత్రం లో శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హన్సికను కూడా ఈ చిత్రంలోకి మరో హీరోయిన్ గా తీసుకున్నారు. అతి త్వరలోనే సెట్స్ కు వెళ్లే ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ అనే దర్సకుడు డైరక్ట్ చేస్తున్నాడు. వేణు శేరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు. ఇక ఈ చిత్రం స్క్రిప్టు గత సంవత్సర కాలంగా జరుగుతోంది. అలాగే ఈ చిత్రానికి రాహుల్ రాజ్ అనే మళయాళి సంగీతం అందించనున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించిన రితు చిత్రం సంగీతం విని ఈ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X