»   » హఠాత్తుగా హన్సిక హాట్ హాట్ గా... అందుకే

హఠాత్తుగా హన్సిక హాట్ హాట్ గా... అందుకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎక్సపోజింగ్ కి కాస్త దూరంగానే ఉంటాననే హన్సిక హఠాత్తుగా తన అందాలను హాట్ హాట్ గా పరుస్తూ ఫొటో షూట్ పెట్టుకుంది. వాటిని మీడియాకు రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే హన్సికకు ఎందుకీ బుద్ది పుట్టింది అంటే ఆమెను మర్చిపోతున్నారు అని శ్రేయాభిలాషులు గుర్తు చేయటమేనని తెలుస్తోంది. కళ్యాణ్ ‌రామ్ హీరోగా 'జయీభవ", నితిన్ హీరోగా 'సీతారాముల కళ్యాణం లంకలో.." వచ్చిన ఈ రెండు ఫ్లాఫ్ చిత్రాలు హన్సికను తెలుగు పరిశ్రమ‌కు దూరం చేశాయని పరిశ్రమ వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. అందులోనూ హన్సిక రెమ్యునేషన్ బాగా పెంచేయటం కూడా ఆమెపై క్రేజ్ తగ్గించేలా చేసాయి. లేకుంటే గోలీమార్ లో గోపీచంద్ సరసన, బద్రీనాధ్ లో అల్లు అర్జున్ సరసన మొదట ఆమెనే అనుకున్నారు. కానీ రేటు దిగిరాననటంతో ఆమె వెనకపడిపోయింది. అందుకే హాట్‌హాట్‌గా ఓ ఫొటో సెషన్‌కి పోజులిచ్చేసింది. 'జస్ట్ నా వయసు ఇంకా పద్దెనిమిదేళ్లే..సినిమాల్లో ఇంకా బోల్డంత కెరీర్ వుంది. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తున్నా. తొందరపాటుతో కొన్ని ఫెయిల్యూర్స్ చవిచూశా. ఇకపై అలాంటి పొరపాట్లు చేయను"అంటూ తన కెరీర్ మీద స్పష్టమైన అవగాహనను ప్రదర్శిస్తోన్న ఈ భామ సినిమా కోసం అవసరమైతే లిప్‌కిస్ సన్నివేశాలకూ తాను వ్యతిరేకం కానంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu