twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హన్సిక 'ఐస్ బక్కెట్ ఛాలెంజ్' (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇప్పుడు సెలబ్రెటీలు నుంచి సామాన్యూల దాక్ 'ఐస్ బక్కెట్ ఛాలెంజ్' లో తడిసి ముద్దవుతున్నారు. మైక్రోసాఫ్ట్ పౌండర్ బిల్ గేట్స్ నుంచి ఫేస్ బుక్ ఓనర్ జుకర్ బెర్గ్ దాకా అంతా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నవారే. ఇప్పుడు ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ కాన్సెప్ట్ లో హన్సిక కూడా పాల్గొంది. ఈ ఛాలెంజ్ ద్వారా 'Lou Gehrig's Disease' వ్యాధికి ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. ఆమె వీడియో మీరు క్రింద చూడవచ్చు...

    <center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/R7si_OwMIXA" frameborder="0" allowfullscreen></iframe></center>

    ఇంతకీ ఐస్ బక్కెట్ ఛాలెంజ్ ఎక్కడ మొదలైందీ అంటే... జూన్ ఫ్రేట్స్ అనే అతను ఈ సరికొత్త కాన్సెప్టుని కనుగొన్నాడు. ఆయన తన ఇరవై తొమ్మిదేళ్ల కుమారుడు పీటర్ కు అరుదైన వ్యాధి సోకింది. దీని గురించి ప్రచారం, కాన్సర్ సంస్ధకు విరాళం దృష్టిలో పెట్టుకుని జూన్ నెలలో ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేసారడు. అక్కడ నుంచి ఈ ఐస్ బక్కెట్ ఛాలెంజ్ అంతటా పాకింది.

    Hansika Stands For 'Ice Bucket Challenge'

    గడ్డకట్టిన చల్లిని నీటిని బక్కెట్ తో తలపై కుమ్మరించుకోవటం, ఆ కుమ్మరించుకన్నదాన్ని వీడియో తీయటం, దాని స్ధాయిలోని మరో ముగ్గురుని ఈ పనికోసం ఛాలెంజ్ చేయటం ఈ ఛాలెంజ్ లో కీలకాంశం.

    ప్రస్తుతం హన్సిక చేతుల్లో తెలుగు, తమిళం కలిపి మొత్తం ఆరు సినిమాలున్నాయి. ఇవన్నీ ఒకేసారి చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. రోజుకి రెండు షిఫ్ట్‌లపాటు 19 గంటలు సినిమా చిత్రీకరణలకే కేటాయిస్తోంది. చాలా అలసటకు గురవుతోందట. ఈ విషయాన్నే ఆమె చెప్పింది.

    పెళ్లి గురించి మాట్లాడుతూ ''నా చేతినిండా సినిమాలున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నా. ఇక పెళ్లికొచ్చిన తొందరేముంది చెప్పండి? ఇంకా నా వయసు ఇరవై రెండే కదా?'' అని చెప్పుకొచ్చింది. హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.

    'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.

    English summary
    'Ice Bucket Challenge' are viral everywhere. Even South Indian heroine, damsel Hansika Motwani too got into action.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X