మరోసారి..పూరీ జగన్నాధ్ తో హన్సిక రెడీ
దేశముదురు చిత్రంతో దర్శకుడు పూరీ జగన్నాధ్ పరిచయం చేసిన అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అయితే వారి కాంబినేషన్ మాత్రం రిపీట్ కాలేదు. అయితే తాజాగా పూరీ మరోసారి ఆమెను తన లేటెస్ట్ సినిమా గోలీమార్ లో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గోపీచంద్ హీరోగా త్వరలో మొదలయ్యే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ కొత్త చిత్రంలో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తాడు. ఇక ప్రస్తుతం హన్సిక..నితిన్ సరసన సీతారాముల కళ్యాణం లంకలో అనే చిత్రంలో చేస్తోంది. అలాగే కళ్యాణ్ రామ్ సరసన ఆమె చేసిన జయీభవ భాక్సాఫీస్ వద్ద భోల్తాకొట్టడంతో తన పాత్రకు ఉండే పరిధి,విస్తృతిని కూడా తెలుసుకునే సినమాలు కమిట్ అవుతున్నట్లు సమాచారం. ఇక పూరీ రూపొందించిన ఏక్ నిరంజన్ కూడా భాక్సాపీస్ ని మెప్పించలేకపోయింది. అలాగే గోపీచంద్ శంఖం కూడా మొదటి వారానికే ధియోటర్స్ దాటి పోయింది. ఇక ఈ సారైనా ఈ ముగ్గురూ విజయాన్ని చవిచూడాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











