హన్సికకు లవ్ లెటర్స్ రాసేముందు ఈ జాగ్రత్త తీసుకోండి
'ఈమెయిల్స్ రూపంలో ఎన్నో ప్రేమలేఖలు ప్రతిరోజూ వస్తుంటాయి. కొన్ని ప్రేమలేఖలను అయితే... తెలుగులో రాసి పంపుతుంటారు.నాకేమో తెలుగు రాదు. ఏ మాత్రం రిలేషన్ లేని నాపై వారు చూపిస్తున్న అనురాగం చూస్తే.. ఆనందం, బాధ రెండూ కలుగుతాయి. ఒక్కోసారైతే వారికోసమైనా సరే తెలుగు నేర్చుకోవాలని అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను' అని హన్సిక చెప్పుకొచ్చింది. తనకు వచ్చే లవ్ లెటర్స్ చదువుకోవటం కోసం ఆమె తెలుగు నేర్చుకోవాలనే ఆలోచన ఆమె కెరీర్ కి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె తెలుగులో చెప్పే ఆమె డైలాగులన్నీ హిందీలో రాసుకుని చెప్తోంది. అందుకోసం ఆమె ఒక రోజు ముందే డైలాగు పేపర్లు తెప్పించుకుని ప్రిపేర్ అయి లొకేషన్ కి వస్తోంది. ఇక ఆమెకు ప్రస్తుతం లవ్ లెటర్స్ రాసేవాళ్ళు ఆమెకు వచ్చిన హిందీలో రాస్తే ఆమె నచ్చి రిప్లై కూడా ఇవ్వవచ్చు. ఇక హన్సిక కి తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేవు. సీతారాముల కళ్యాణం లంకలో,జయీభవ చిత్రాలు ఆమె కెరీర్ ని పాతాళానికి తోసేసాయి.


Click it and Unblock the Notifications











