'హ్యాపీడేస్' తో హీరోయిన్ గా క్లిక్ అయ్యి వరస ఆఫర్లు తో ఉక్కిరబిక్కిరి అవుతున్న ముద్దుగుమ్మ తమన్నా.దేశ ముదురు తో తెలుగువారి ని ఆకట్టుకున్న సుందరాంగి హన్సిక.తమన్నా నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో కాళిదాసు లో ఆడి పాడి అంద చందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకుంది.వచ్చే వారం రిలీజు కానున్న నిన్న నేడు రేపు సినిమాలోనూ చాలా ఉషారుగా కన్పిస్తుందట.హన్సిక యన్టీఆర్ సరసన కంత్రి లో అదరకొట్టిందని యూనిట్ వాళ్ళు గుసగుసలాడుతున్నారు.అంటే రిలీజయితే ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట.మరి వీళ్ళిద్దరూ ఒక్కసారి కనపడితే ఎలా ఉంటుంది.తెర వేడిక్కిపోతుంది.మరి ఆ సాహసం చేయటానికి రెడీ అవుతోంది ఎవరో కాదు భారీ చిత్రాల నిర్మాత యమ్.యస్.రాజు గారు.బి.గోపాల్ దర్శకత్వంలో దేవదాస్ ఫేమ్ రామ్ హీరోగా ప్లాన్ చేస్తున్న చిత్రం లో ఈ కాంబినేషన్ కనపడి కనువిందు చేయబోతోందిట.
Story first published: Friday, July 17, 2026, 1:04 [IST]