twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాప్ హీరోతో హన్సిక

    By Staff
    |

    Hansika
    వరస ఫ్లాఫ్ ల హీరో నితిన్ తో హాట్ హన్సిక జతకట్టనుంది. సిద్దు ప్రమ్ శీకాకుళం దర్శకుడు ఈశ్వరరెడ్డి డైరక్ట్ చేయనున్న చిత్రంలో ఈ పెయిర్ ఎంపికైంది. జూన్ పదిహేను నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని సిద్దు ప్రమ్ శీకాకుళం నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అల్లరి నరేష్ తో చేసిన సిద్దు ప్రమ్ శీకాకుళం చిత్రం పెద్దగా ఆడకపోయినా మళ్ళీ అదే నిర్మాతలు ఇవ్వటం చాలా మందిలో ఆసక్తి రేపుతోంది. ఇక ఈ కొత్త చిత్రం కూడా పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెమెంట్ తో ఉంటుందని చెప్తున్నారు.

    అలాగే ఈశ్వరరెడ్డి కూడా చాలా కాలంగా ప్రముఖ హాస్య దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ వద్ద పనిచేసారు. ప్రస్తుతం హన్సిక..కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ చిత్రంలో చేస్తోంది. కొత్త దర్సకుడు కొండేపాటి సత్తిబాబు(నరేన్) ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. నితిన్ ప్రస్తుతం రెచ్చిపో చిత్రంలో చేస్తున్నాడు. పరుచూరి మురళి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాని స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి.రమణ నిర్మిస్తున్నారు. అతని సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X