నాగచైతన్యతో ఎందుకు కాదన్నానంటే....: హన్సిక

By Srikanya

హైదరాబాద్ : నాగచైతన్య, సునిల్ కాంబినేషన్‌లో రూపొందబోయే వెట్టై రీమేక్ నుంచి హన్సిక ఎక్సిట్ అయిన సంగతి అయిన సంగతి తెలిసిందే. అయితే కావాలనే నాగచైతన్య ఆమెను తప్పించి,తమన్నా ను సీన్ లోకి తెచ్చాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం పనిలేక మీడియావారు సృష్టించిన రూమర్స్ అంటూ హన్సిక మండిపడింది. అంతేగాక ఆ రూమర్స్ ని ఖండిస్తూ ఆమె ఓ ట్వీట్ చేసి తను ఈ ప్రాజెక్టు నుంచి బయిటకు వెళ్లిపోవటానికి అసలు కారణం వివరించింది.

ఆమె ట్వీట్ లో...దురదృష్టవశాత్తు నేను తమిళ వెట్టై రీమేక్ నుంచి బయిటకు వచ్చాను. అయితే దానికి కారణం కేవలం బల్క్ డేట్స్ ఇవ్వలేకపోవటమే. వారు ఈ సంవత్సరం చివరకు ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ నా చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే తప్పుకున్నాను..మరే వేరే కారణమేది లేదు. ఆ టీమ్ కు నా బెస్ట్ విషష్. ఇదే అసలైన రీజన్ కాబట్టి ఇక ఈ విషయమై నెట్ లో, ప్రింట్ లో వచ్చే రూమర్స్ కు ఫుల్ స్టాఫ్ పెడతారని భావిస్తున్నాను అని ట్వీట్ చేసింది.

ఇక కొంచెం ఇష్టం కొంచెం కష్టం దర్శకుడు పి.కిశోర్‌కుమార్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ముందుగా హన్సికను నాయికగా తీసుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలోకి తమన్నా వచ్చారు. దానికి పెద్ద కారణాలేవీ లేవు. కేవలం హన్సిక డేట్స్ కుదరకపోవడంవల్లే ఈ మార్పు జరిగింది.

జూన్, జూలై మాసాల్లో హన్సిక ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారు. కానీ సినిమా ప్రారంభం విషయంలో జాప్యం జరగడంతో హన్సిక మళ్లీ డేట్స్‌ని ఎడ్జస్ట్ చేయలేకపోయారు. తెలుగుతో పాటు హన్సిక తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఈ మార్పు జరిగింది. ఇదిలా ఉంటే '100% లవ్'తో నాగచైతన్య, తమన్నా జంట క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే తమన్నా ఇదే దర్శకుడుతో గతంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం లోనూ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X