హన్సిక పుట్టిన రోజు గిప్ట్ లు సెల్, ప్లాట్...
హాట్ స్టార్ హన్సిక సోమవారం పుట్టినరోజును ముంబైలో జరుపుకుంది. అలాగే బర్తడే గిప్ట్ లుగా ఆమె కొత్త సెల్లు...ఫ్లాటూ పొందింది. అలాగే వాటిని ఇచ్చింది మరెవరో కాదు..ఆమె తల్లి. ఈ విషయం హన్సిక చెప్తూ...ప్రతి పుట్టిన రోజుకీ ఉదయాన్నే గుడికెళ్ళే అలవాటుంది. ఇంటికొచ్చాక కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తాను. అమ్మ వెరైటీ వెజిటేరియన్ ఫుడ్ ని వండి పెడుతుంది. ఈ ఏడాది వీటన్నింటితో పాటు నేను నటించిన కొన్ని సినిమాల డీవీడీలను చూస్తూ కాలక్షేపం చేశాం. ఈ పుట్టిన రోజుకు అమ్మ నాకు కొత్త సెల్లు...ఫ్లాటూ కొనిపెట్టింది అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











