హన్సిక వెర్సెస్ తమన్నా

సూర్య, తమన్నా జంటగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏవిఎం ప్రొడక్షన్స్ తమిళంలో నిర్మించిన 'అయన్' చిత్రం తెలుగులోకి 'వీడొక్కడే' పేరుతో అనువదింపబడింది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమ సంస్థే తెలుగులో కూడా విడుదల చేస్తోందని, మే ఒకటిన 150 ప్రింట్లతో విడుదల చేస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్, హన్సిక జంటగా రాజేంద్రబాబు దర్శకత్వంలో కన్నడంలో రూపుదిద్దుకుని విజయవంతమైన 'బిందాస్' చిత్రాన్ని సంతోష్ ప్రొడక్షన్స్ పతాకంపై 'పండుగాడు' పేరుతో అనువదించారు నిర్మాత జె.బాలరాజు. ఈ చిత్రం ఈనెల 24న విడుదలవుతోంది. వీటి మధ్యలో జగపతిబాబు హీరోగా రాజకీయాల నేపధ్యంలో చేసిన అధినేత రిలీజ్ అవుతోంది.
అయితే తమన్నా ప్రధాన పాత్రలో వచ్చిన ఆనంద తాండవం చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.శంకర్, మణిరత్నం వంటి మెగా దర్శకులుకు కథ లందించిన సుజాత రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం కావటంతో అంతటా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.ఎనభైల్లో ఈ కథతో వచ్చి వుంటే ఏమన్నా రిజల్ట్ ఎక్సపెక్ట్ చేయవచ్చు అని టాక్ తెచ్చుకుంది..మరీ పాత వాసనలుతో ఆస్కార్ రవిచంద్రన్ ఫీల్ గుడ్ మూవీ అంటూ హైప్ చేసి అందించిన ఆనందతాండవం తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ పరిణామంతో తమన్నా, హన్సిక క్రేజ్ ని క్యాష్ చేసుకుందామని డబ్బింగ్ చేసుకున్నావాళ్లకి ఏ రిజల్ట్ రానుందో చూడాలి. ఎందంకంటే జెనీలియా క్రేజ్ చూసి రిలీజ్ చేసిన డబ్బింగ్ చేసిన సచిన్ చిత్రం సోదిలోకి లేకుండా పోయింది.


Click it and Unblock the Notifications











