దేవీశ్రీ ప్రక్కన హీరోయిన్
దేవీశ్రీ ప్రసాద్ హీరోగా ఎమ్ ఎస్ రాజు ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతని ప్రక్కన హీరోయిన్ గా ఎవరు చేస్తారంటూ రకరకాల ఊహాగానాలు వినపడ్డాయి. అయితే హన్సిక ని అతనికి జోడీగా తీసుకున్నట్లు సమాచారం. హన్సిక ఇంతుకుముందు ఎమ్ ఎస్ రాజు బ్యానర్ లో వచ్చిన మస్కా చిత్రంలో రామ్ కి జోడిగా చేసింది. ఇక దేవీశ్రీ హీరోగా ఛార్మి హీరోయిన్ గా సినిమా చేద్దామంటూ ప్రపోజల్స్ వచ్చాయి. అయితే వాటిని దేవిశ్రీ సీరియస్ గా కన్సిడర్ చేయలేదు. అయితే తనని దేవి చిత్రంతో పరిచయం చేసిన ఎమ్ ఎస్ రాజు చిత్రం అనేసరికి కాదనలేకపోయారని సమాచారం. దాంతో దేవీ ఇప్పుడు టాలీవుడ్ హిమ్మేష్ రేశ్మియా అని కొందరంటున్నారు. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంగీతప్రధానమైనదని వేరే చెప్పనక్కర్లేదు. అయితే రొమాంటిక్ ఏంగిల్ కూడా ఈ చిత్రంలో ఉండబోతోందని వినికిడి. మంత్ర దర్శకుడు తులసీరామ్ ని ఈ ప్రాజెక్టుకు దర్శకుడుగా ఎంపికచేసారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంభందించి మిగతా వివరాలు అఫీషియల్ గా ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications











