పులితో హన్సిక

మొదట ఆ పాత్ర కోసం బాలీవుడ్ అందాల భామ కరీనాని సంప్రదించారు. కాని ఆమె తాజా చిత్రం 'తషాన్' ఫ్లాపయిన దగ్గరనుండి తమాషాగా పూర్తి స్ధాయి బిజీ అయిపోయింది. స్లిమ్ అయిన ఆమె చుట్టూ బాలీవుడ్ మరింత స్పీడుతో అలుపు సొలుపు లేకుండా చక్కర్లుకొడుతోంది. దాంతో ఆమె పులికి ఛాన్స్ ఇవ్వలేక పోయింది. ఇది ఆమెకు రివర్స్ లో బొద్దుగా ఉండే హన్సికు ప్లస్ అయింది. నిర్మాతలు హన్సికను సంప్రదించారు. కంత్రి తర్వాత ఆ రేంజి హీరోలతోనే చెయ్యాలని చూస్తున్న హన్సిక ఈ ఆఫర్ రావటం చెప్పలేని ఆనందాన్ని కలిగించిందిట. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు ఆ పాత్రకి తమని అడిగితే బాగుండునని రాయబారాలు సైతం పంపటానికి వెనుకాడలేదుట. దాంతో వారంతా హన్సిక లక్కీ కదా అని కుళ్ళుకునేలా పరిస్ధితి వచ్చింది.దాంతో ఈ చిత్రం పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి... ట్రేడ్ లో హైప్ క్రియేట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











