అంతటి డిజాస్టర్ తర్వాత కూడా: మళ్ళీ తలుపు తట్టిన అవకాశం, నితిన్‌కి భారీ ఫ్లాప్ ఇచ్చాక
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ వారు శర్వానంద్ తో నిర్మించే సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రేపు రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా లాంచ్ కానుంది.
Recommended Video

ఒక్క ఫ్లాప్ తర్వాత హీరో ,హీరోయిన్ల పరిస్థితికన్నా ముందుగా రిస్క్ లో పడేది దఋసకుడే ఒక్క టాప్ హీరోకి ఫ్లాప్ ఇచ్చినా ఇక ఆ తర్వాత సినిమాకోసం ఎదురు చూడాల్సిందే. వెంటనే మరో చాన్స్ కొట్టటం ట్qఆలీవుడ్ లో అంత వీజీ కాదు. అలాంటిది తీసిన మూడు సినిమల్లొ రెండు కనీస మెప్పు పొందితే ఒకటి డిజాస్టర్. మరి ఇలాంటి స్థితిలో మరో సినిమా చేతికి రావటం అంటే అదృష్టమే.. ఇంతకీ ఎవరా దర్శకుడూ అంటే హను రాఘవపూడి.

హను రాఘవపూడి
అయినా కూడా ఇప్పుడు మరో మంచి హీరోని పట్టేసి సినిమాను తీయడానికి రెడీ అయ్యాడు. అందాల రాక్షసి తో మొదటి అపజయాన్ని అందుకున్న హను రాఘవపూడి ళ్ళీ ఇంకో సినిమాతో అయినా హిట్ అందుకోవాలన్నంత కసి మీద ఉన్నాడు. అందాల రాక్షసి తర్వాత నానితో కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమా ఒక్కటే కాస్త బెటర్ అనిపించుకుంది.

నితిన్‌తో "లై"
అయితే ఇక్కడకూడా హను కంటే ఎక్కువ పేరొచ్చింది ఆ సినిమా హీరో నాని కే. దర్శకత్వంలో కథలో ఏమి కొత్తదనం ఉండదు. ఇక ఆ సినిమా హిట్ అయ్యింది అని బయటకు ప్రచారాన్ని బాగా చేయడంతో ఈ బజ్ ని పట్టుకొని నితిన్ లాంటి హీరోతో లై అనే సినిమా చేసాడు.

మార్కెట్ కు మించిన బడ్జెట్
ఆ సినిమా హిట్ అయి ఉంటే హను రాఘవపూడి మంచి క్రేజీ డైరెక్టర్ గా అవకాశాలతో సతమతమయ్యే వాడే గానీ పాపం ఆ సినిమా . నితిన్ మార్కెట్ కు మించిన బడ్జెట్ కూడా ఆ సినిమాకు పెట్టారు. అయితే ఫైనల్ గా సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్
అయితే హను అపజయాలతో సంబంధం లేకుండా మరో అవకాశం దక్కించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ వారు శర్వానంద్ తో నిర్మించే సినిమాకు హను దర్శకత్వం వహిస్తున్నాడు. రేపు రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా లాంచ్ కానుంది. మరి ఇసారైనా హను తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











