నానిని కంప్లీట్‌గా మార్చేస్తా.. ఆ పాత్రలో నేచురల్ స్టార్, క్రేజీ న్యూస్ చెప్పిన డైరెక్టర్!
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ లాంటి ఎమోషనల్ ప్రేమకథ చిత్రాలతో దర్శకుడు హను రాఘవపూడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో చేసిన లై చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. హను రాఘవపూడి లేటెస్ట్ మూవీ పడిపడి లేచే మనసు చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలతో ఈ యువ దర్శకుడు బిజీగా గడుపుతున్నాడు.

పడి పడి లేచే మనసు
శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. సాయిపల్లవి, శర్వానంద్ కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్ర పాటలు ఇప్పటికే ఆడియన్స్ కు బాగా చేరువయ్యాయి. ఈ చిత్రంపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కోల్ కతా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. పదహారేళ్ళ వయసు పడి పడి లేచే మనసు అనే పాటలోని ఈ లైన్ నాకు బాగా నచ్చింది. దీనిపై ప్రేమ కథ చేస్తే బావుంటుందని భావించి కథ సిద్ధం చేశా అని హను రాఘవపూడి తెలిపాడు.

నేచురల్ స్టార్ నానితో
ఇదిలా ఉండగా తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ హను రాఘవపూడి ఆసక్తికర విషయం వెల్లడించాడు. నేచురల్ స్టార్ నానితో మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. ఇది నిజంగా క్రేజీ న్యూస్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రం మంచి విజయం సాధించింది. అనేక మలుపులు, నాని, మెహ్రీన్ మధ్య సాగే ప్రేమ కథకు యువత ఫిదా అయ్యారు. మరోమారు ఆ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ఈ దర్శకుడు రెడీ అవుతున్నాడు.

నానిని కంప్లీట్‌గా మార్చేస్తా
నాని కిశోరం మిలటరీ నేపథ్యంలో సాగే కథని సిద్ధం చేసినట్లు హను రాఘవపూడి వెల్లడించాడు. ఈ చిత్రం కోసం నాని గెటప్ కంప్లీట్ గా మార్చేయాలి. ప్రస్తుతం నాని చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాలు ఫినిష్ అయ్యాక ఈ చిత్రంపై దృష్టిపెడతా అని హను రాఘవపూడి తెలిపాడు. నాని ప్రస్తుతం జెర్సీ చిత్రంలో క్రికెటర్ గా నటిస్తున్నాడు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శత్వంలో ఓచిత్రాన్ని ఒకే చేశాడు. ఈ లెక్కన నాని, హను రాఘవపూడి చిత్రం మరింత ఆలస్యం కానుంది.

మైత్రి మూవీస్ బ్యానర్‌లో
వరుసగా ప్రేమ కథలు తెరక్కించడంపై హను రాఘవపూడి స్పందించాడు. కొత్త కథ రాయాలనుకున్నప్పుడు అలాంటి సందర్భాలే వస్తున్నాయి. అందుకే ప్రేమ కథలు చేస్తున్నా. భవిష్యత్తులో అన్నిరకాల కథలు చేస్తా అని తెలిపాడు. మైత్రి మూవీస్ బ్యానర్ లో తన తదుపరి చిత్రం ఉండిందని హను వివరించాడు. ఈ చిత్రానికి ఎవరు హీరో అనేది త్వరలోనే ప్రకటిస్తా అని తెలిపాడు.


Click it and Unblock the Notifications











