twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రష్మిక మందన్నకు జీవితాతం రుణపడి ఉంటా’

    |

    ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 5న విడుదలైన సీతారామం చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో సీతారామంకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది.ఈ వేడుకలో హను రాఘవపూడి మాట్లాడుతూ..

    Hanu Raghavapudi

    దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. గత 5వ తేది నుండి ఒక ఊహప్రపంచంలో బ్రతుకున్నట్లుగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు తీశాను. కానీ ఆ సినిమాలకు ఇంత ఆదరణ లభించలేదు. నా జీవితంలో మొదటిసారి ఇలాంటి ఆదరణ చూస్తున్నాను. ఇప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ ఇది. సీతారామం నా మనసుకు బాగా దగ్గరైన కథ. సీతారామం కథ దృశ్య రూపంలోకి మారడానికి చాలా మంది కృషి ఉంది. తెరపై కనిపిస్తున్న రామ్ సీతతో పాటు తెరవెనుక చాలా మంది మనిషి చేశారు. వారందరికీ పేరుపేరునా థాంక్స్.

    మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన గీతాంజలి నా ఫేవరేట్ మూవీ. ఆ సినిమాని నుంచి చాలా నేచుకున్నా. ఈ థ్యాంక్యూ మీట్‌కు వచ్చిన నాగార్జునకు కృతజ్ఞతలు. నన్ను చాలా భరించిన రామ్, సీత గారికి కృతజ్ఞతలు.

    సీతారామం సినిమా ఒక దృశ్య కావ్యంలా వచ్చిందంటే కారణం పీఎస్ వినోద్ గారు. ఆయనకి కృతజ్ఞతలు. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ప్రొడక్షన్ డిజైన్ సునీల్ బాబు, కాస్ట్యుమ్స్ శీతల్‌కు థాంక్స్. సుమంత్ గారు విష్ణు శర్మ పాత్ర చేయకపోయేతే ఇంత వైబ్ వచ్చేది కాదు. అఫ్రిన్ పాత్ర చేసిన రష్మిక మందన్నకు నేను జీవితాంతం రుణపడి వుంటాను. స్వప్న గారు నాపై ఎంతో నమ్మకం ఉంచారు. సీతారామం క్రెడిట్ స్వప్న గారికే దక్కుతుంది. ఈ సినిమాని గొప్పగా ఆదరిస్తూ రిపీటడ్ గా చూస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు

    English summary
    Hanu Raghavapudi's Sita Ramam doing very well at box office. In this occassion, Unit organised a success meet.Hanu Raghavapudi speech at Sita Ramam Thank you meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X