నానితో మరో సినిమా చేసేందుకు ఆ దర్శకుడి ప్రయత్నాలు!

నాని వరుస విజయాలకు కృష్ణార్జున యుద్ధం చిత్రం బ్రేక్ వేసింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందింది. ప్రస్తుతం నాని బిగ్ బాస్ 2 తో సందడి చేస్తూనే తన సినిమాలని లైన్ లో పెడుతున్నాడు. నాని ప్రస్తుతం నాగార్జునతో మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా యువ దర్శకుడు హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమ గాధ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నానికి అందించాడు. ఆ తరువాత హను చేసిన లై చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ దర్శకుడు శర్వానంద్ తో పడి పడి లేచే మనసు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శర్వానంద్, సాయి పల్లవి ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.

Hanu Raghavapudi will planning to direct Nani second time

ఈ చిత్రం పూర్తయ్యాక నానితో మరో సినిమా చేయాలని హను భావిస్తున్నాడు. పడి పడి లేచే మనసు చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ లోనే ఈ చిత్రం కూడా రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అధికారిక సమాచారం రావలసి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X