పుష్ప సినిమా చూసిన ఇండియన్ టీమ్.. అలా లీక్ చేసిన క్రికెటర్.. రివ్యూ ఇవ్వడంతో అల్లు అర్జున్ ఏమన్నారంటే?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప 2 వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇక మూడో వారంలో కి అడుగు పెట్టింది. ఈ సినిమా 14 రోజుల్లో మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఇండియన్ క్రికెట్ టీమ్ చూసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

బన్నీ వన్ మ్యాన్ షో

బన్నీ వన్ మ్యాన్ షో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ సినిమా.. బన్నీ వన్ మ్యాన్ షోగా నిలిచి మంచి వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్ తో సినిమాను నిలబెట్టాడని విశ్లేషకుల టాక్ తో సినిమా కూడా భారీ వసూళ్లు దిశగా దూసుకెళ్తుంది. ఇక 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

వసూళ్లు బయటకు రాలేదు

వసూళ్లు బయటకు రాలేదు

రెండు రాష్ట్రాల్లో 14 రోజులకు గాను 'పుష్ప'కు రూ. 78.90 కోట్లు షేర్ వచ్చింది. కర్నాటకలో 14 రోజులకు గాను రూ. 10.35 కోట్లు, తమిళనాడులో 14 రోజులకు గాను రూ. 8.51కోట్లు, కేరళలో 14 రోజులకు గాను రూ. 4.67 కోట్లు, హిందీలో 14 రోజులకు గాను రూ. 22.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 14 రోజులకు గాను రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.72 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల్లోనే రూ. 139.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 238 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ఇక వరల్డ్ వైడ్ గా రూ. 144.90 కోట్లు బిజినెస్ చేసిన పుష్ప బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే సినిమా మరో 06.30 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఇంకా గురువారం వసూళ్లు బయటకు రాలేదు కాబట్టి ఆ వసూళ్లు కూడా వస్తే మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

హనుమాన్ విహారి సోషల్ మీడియా పోస్ట్

హనుమాన్ విహారి సోషల్ మీడియా పోస్ట్

ఆ సంగతి అలా ఉంచితే అయితే తాజాగా తాను పుష్ప సినిమా చూస్తున్నట్లుగా ఇండియన్ క్రికెటర్ హనుమాన్ విహారి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హనుమ విహారి ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. ఆయన ఇండియన్ క్రికెట్ టీమ్ తో కలిసి ఈ సినిమా చూసినట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఆయన చెప్పకపోయినా తెలుగువాడైన హనుమవిహారి హిందీలో సినిమా చూడడంతో మిగతా ఇండియన్ టీమ్ మేట్స్ కూడా ఉండి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

ఇండియన్ క్రికెట్ టీం

ఇండియన్ క్రికెట్ టీం

ముందుగా ''సినిమా టైం, ఇప్పుడు నేను ఏ సినిమా చూస్తున్నాను గెస్ చేయండి'' అంటూ సోషల్ మీడియా వేదికగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఫోటోను జనుము విహారి పోస్ట్ చేయడంతో, పుష్ప సినిమా అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి పుష్ప హిందీ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో పుష్ప యూనిట్ సహకారంతో ఇండియన్ క్రికెట్ టీం పుష్ప సినిమా చూసి ఉండొచ్చు అని సోషల్ మీడియాలో అయితే గట్టిగా ప్రచారం జరుగుతోంది.

Recommended Video

SkyLab Movie Review || Filmibeat Telugu
ఆనందం కలిగిస్తుందన్న అల్లు అర్జున్

ఆనందం కలిగిస్తుందన్న అల్లు అర్జున్

మరో విషయం ఏమిటంటే పుష్ప సినిమా చూసిన తర్వాత తన రివ్యూ కూడా ఇచ్చారు హనుమ విహారి. పుష్ప సినిమా చూసినంత సేపు పుష్పరాజ్ ట్రాన్స్ లోనే ఉండిపోయాను అని, ఈ సినిమా యూనిట్ సహా అల్లు అర్జున్ కి కంగ్రాట్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక హనుమ విహారి పోస్ట్ పెట్టడం తో దానికి అల్లు అర్జున్ కూడా స్పందించారు. మీకు సినిమాలో నా పర్ఫామెన్స్ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, అలాగే పుష్ప ప్రపంచం కూడా మీకు నచ్చడం ఆనందం కలిగిస్తుందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X