Adipurush: ప్రభాస్‌పై దేవదత్తా ఊహించని కామెంట్స్.. యాంకర్ ప్రదీప్‌కు దండం.. హనుమాన్ హైలైట్ స్పీచ్
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో దాదాపు రెండు దశాబ్దాల పాటు హవాను చూపించి.. ఇప్పుడు బాలీవుడ్‌పై దండయాత్ర చేయడానికి సన్నద్ధం అవుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలనే చేస్తోన్న అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే సినిమాతో రాబోతున్నాడు. రామాయణం నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఇందులో హనుమంతుడి పాత్రను పోషించిన దేవదత్తా ఏం మాట్లాడారు అనేది చూద్దాం పదండి!
ఆదిపురుష్‌గా వస్తున్న ప్రభాస్: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో రెబెల్ స్టార్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్: విజువల్ వండర్‌గా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలోని తారక రామ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవంగా జరుగుతోన్న ఈ వేడుకకు యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరవడంతో సందడిగా ఉంది.
జోష్ నింపిన హనుమంతుడు: 'ఆదిపురుష్' మూవీతో హనుమంతుడి పాత్రను పోషిస్తోన్న దేవదత్తా నాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందులో అతడు 'జై శ్రీరామ్' అనే నినాదం చేస్తూ తన స్పీచ్‌ను మొదలు పెట్టాడు. అంతేకాదు, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు గురించి తనదైన రీతిలో ఎలివేషన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపేలా మాట్లాడాడు.

ఆయన మహాదేవుడు అంటూ: 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవదత్తా మాట్లాడుతూ.. 'ఆ శివుడిని నీలకంఠుడు అంటారు. ఆయనకు నీలం రంగు అంటే అంత ఇష్టం. ఆ మహాదేవుడు సృష్టించగలడు.. నాశనం చేయగలడు. అలాగే, ఓం రౌత్ సార్ యాక్షన్, కట్ చెప్తారు. ఈయనకు కూడా శివుడిలా నీలం రంగు అంటే ఇష్టం. సినిమాలో ప్రతి ఫేం అదే రంగులో చూపించేవారు' అంటూ చెప్పుకొచ్చాడు.
త్రిమూర్తులు.. అలా సాధ్యం: ఆ తర్వాత దేవదత్తా కొనసాగిస్తూ.. 'ఈ ఆదిపురుష్ సినిమా వెనుక త్రిమూర్తులు ఉన్నారు. అందులో ఒకరు మహాదేవుడి లాంటి వారు ఓం రౌత్ సార్. ఆ తర్వాత బ్రహ్మ లాంటి వారు భూషణ్ సార్. ఇక, మిగిలిన మేమంతా మూడో అవతారం. మేమంతా కలవబట్టే ఈ సినిమా సాధ్యమైంది. దీనికి ప్రభాస్ సార్ గారు మరింత బలాన్ని ఇచ్చారు' అంటూ తనదైన రీతిలో మాట్లాడాడు.
ఒక్కడే డార్లింగ్.. ప్ర'కృతి': దేవదత్తా కొనసాగిస్తూ.. 'ఈ విశ్వానికి ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు.. అలాగే ఈ ప్రపంచానికి ఒకడే డార్లింగ్.. అతడే మన ప్రభాస్ డార్లింగ్ సార్. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. మీ ఫ్యామిలీలో చేరడం హ్యాపీ. ప్ర'కృతి' కూతురు సీతా దేవి ఇక్కడే ఉన్నారు. ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడి మా లక్ష్మణుడు. వీళ్లందరితో వర్క్ చేయడం అద్భుతంగా ఉంది' అన్నాడు.

ప్రదీప్‌కు నమస్కారం చేస్తూ: చివర్లో దేవదత్తా మాట్లాడుతూ.. 'జూన్ 16వ తేదీన మీరందరూ 'చిత్ర మందిర్' (థియేటర్)కు వెళ్లాలి. ఎందుకంటే శ్రీ ప్రభాస్ గారు అక్కడ శ్రీరామోత్సవం చూపించబోతున్నారు' అని ముగించాడు. తర్వాత యాంకర్ ప్రదీప్ తెలుగులో మాట్లాడుతుండగా దేవదత్తా ఆపేసి 'నాకు తెలుగు అంటే గౌరవం. కానీ, నేర్చుకోడానికి టైం పడుతుంది. ఇంగ్లీష్‌లో అడుగు' అంటూ నమస్కారం చేసేశాడు.


Click it and Unblock the Notifications











