HanuMan Release Date Fix: టాలీవుడ్ స్టార్ హీరోలతో ఢీకొంటున్న ఇండియన్ సూపర్ హీరో హనుమాన్
ఆ! సినిమాతో డైరెక్టర్ గా మారి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆకట్టుకున్న ప్రశాంతవర్మ ఆ తర్వాత కల్కి, జాంబీరెడ్డి వంటి సినిమాలు కూడా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన ప్రస్తుతం హనుమన్ అనే ఒక సబ్జెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సబ్జెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలోనూ ఆసక్తి నెలకొనగా ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడి చూస్తోంది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే....

హనుమాన్ వచ్చేస్తున్నాడు: ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా తేజ సజ్జ ప్రధాన పాత్రలో హనుమాన్ అనే ఒక సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. సినిమా యూనిట్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన సినిమాలు విడుదల చేస్తున్నట్టుగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో తేజ ఆంజనేయస్వామి జెండాతో ఒక పర్వతం మీద నుంచి దూకుతున్నట్లుగా కనిపిస్తున్నాడు.

పాన్ వరల్డ్ మూవీ..: ఈ సినిమాని తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జాతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అయితే సంక్రాంతికి ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి రిలీజ్ డేట్ మీద కన్నేసాయి.

ఆ హీరోలతో పాటీగా...: ప్రాజెక్టు కె, గుంటూరు కారం, ఈగల్ వంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు వాటితో పోటీ పడుతూ తేజా హీరోగా నటిస్తున్న ఈయన హనుమాన్ మూవీ కూడా రంగంలోకి దిగటం గమనార్హం. ప్రశాంత వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగకుండా జరుగుతున్నాయి.

అందుకే లేట్..: ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేయగా సినిమా మరో లెవల్ లో ఉండబోతుందని హింట్స్ అయితే వస్తున్నాయి. వాస్తవానికి సినిమా ఈ ఏడాది మే 12 అని విడుదల చేస్తున్నట్టు ముందు సారీ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇంకా విఎఫ్ఎక్స్ పనులు పూర్తిగా అప్పట్లో పోస్ట్ పోన్ చేసినట్లు ప్రకటించింది. అయితే అప్పుడే పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామనే విషయాన్ని ప్రకటించలేదు. కానీ తాజాగా సంక్రాంతికి వస్తున్నట్లు అధికారికంగా హింట్ చేశారు. వీఎఫ్ఎక్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసమే అంత సమయం వెచ్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











