Sankranthi 2024: అత్యధికంగా అమ్ముడుపోయిన హనుమాన్ టికెట్లు.. అతి తక్కువగా దేనికి వచ్చాయంటే?

2024 సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటి వరకు ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. అలాగే రేపు మరో సినిమా విడుదల కాబోతుంది. ఈక్రమలోనే సినీ ప్రియులు అందరూ తమకు నచ్చిన చిత్రాలు చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. తమ అభిమాన హీరో, లేకపోతే పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను ఫ్యామిలీతో కలిసి వీక్షించేందుకు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో.. అంటే జనవరి 12వ తేదీ ఉదయం నుంచి జనవరి 13వ తేదీ ఉదయం వరకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి.. ఏ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గడిచిన 24 గంటల్లలో బుక్ మై షోలో ఎక్కువగా బుక్ అయిన టికెట్లు, ఏయే సినిమాల టికెట్లు అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో పాటు తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమాకు ఎక్కువగా టికెట్లు అమ్ముడు అవుతున్నాయి. ముఖ్యంగా నిన్న గుంటూరు కారంకు ఎక్కువ హైప్ ఉండగా.. నిన్న ఆ సినిమాకే ఎక్కువ టికెట్లు అమ్ముడు పోయాయి. కానీ ఈరోజు కథ మారింది. హనుమాన్ సినిమా విజ్యువల్ వండర్ గా ఉండడంతో, టాక్ కూడా పాజిటివ్ గా వస్తుండడంతో మరింత ఎక్కువ మంది టెకెట్లు బుక్ చేసుకున్నారు.

Hanuman Movie Sold The Most Tickets in Sankranthi 2024 Cinemas And List is Here Check Details

ఒక్క బుక్ మై షో ద్వారానే గడిచిన 24 గంటల్లో 336.72 కే టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే 3 లక్షల 36 వేల 720 మంది హనుమాన్ చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా టాప్ లో హనుమాన్ నిలిచింది. ఇక మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం రెండో స్థానికి వచ్చింది. ఈ సినిమాను చూసేందుకు 241.38కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 2 లక్షల 41 వేల 380 మంది బుక్ మై షో ద్వారా ఈ సినిమాను చూడనున్నారు. ఇక ధనుష్ హీరోగా చేసిన కెప్టెన్ మిల్లర్ సినిమా మూడో స్థానంలో నిలిచింది.

Hanuman Movie Sold The Most Tickets in Sankranthi 2024 Cinemas And List is Here Check Details

గత 24 గంటల్లో కెప్టెన్ మిల్లర్ కు చెందిన 137.32కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే లక్షా 37 వేల 320 మంది ఈ సినిమా చూడాలని టికెట్లు బుక్ చేసుకున్నారు. అలాగే శివకార్తికేయన్ హీరోగా చేసిన అయలాన్ సినిమా కోసం 114.57కే టికెట్లు అమ్ముడు పోయాయి. 24 గంటల్లోనే లక్షా 14 వేల 570 టికెట్లను సినీ ప్రియులు బుక్ చేసుకున్నారు. అలాగే ఈరోజే విడుదల అయిన విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాను చూసేందుకు కూడా చాలా మందే అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకున్నారు. మొత్తం 30.56కే అంటే 30 వేల 560 మంది ఈ సినిమాను చూడాలని టికెట్లు బుక్ చేసుకున్నారు.

Hanuman Movie Sold The Most Tickets in Sankranthi 2024 Cinemas And List is Here Check Details

ఇక చివరి స్థానంలో నాగార్జున హీరోగా రాబోతున్న నా సామి రంగా ఉంది. ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లను అందుబాటులో ఉంచగా.. గడిచిన 24 గంటల్లో 12.88కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే 12 వేల 880 మంది ఈ సినిమా చూడడానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని పెట్టుకున్నారు. చూడాలి మరి సంక్రాంతి రేస్ లో ఏ సినిమా టాప్ లో నిలబడుతుందో.. ఏ సినిమా ఫ్లాప్ గా మారుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X