Ayodhya Ram Mandir: హనుమాన్‌కు బంపర్ ఆఫర్.. మరో 500తో అదిరిపోయే రికార్డు

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినా.. దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన సినిమానే 'హనుమాన్'. రియల్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంతో అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ చిత్రం ఆరంభంలోనే యమ హైలైట్ అయింది. అందుకు తగ్గట్లుగానే గ్రాండ్‌గా రిలీజ్ అవడంతో పాటు బాక్సాఫీస్ బెండు తీస్తూ సంచలన విజయాన్ని సైతం సొంతం చేసుకుంది.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'హనుమాన్'. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ప్రేక్షకుల స్పందన భారీ స్థాయిలోనే లభిస్తోంది. ఇలా ఈ చిత్రం ఇప్పటికే రూ. 90 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 50 కోట్లకు పైగా లాభాలను కూడా సొంతం చేసుకుంది.

HanuMan Movie Theatres Increased In North India On The Occasion of Ayodhya Event

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీ అంటే నేడు అంగరంగ వైభవంగా జరపనున్న విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా దేశం మొత్తం డివోషనల్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఇది కూడా 'హనుమాన్' మూవీ సక్సెస్ అవడానికి కారణం అయింది. అందుకే చిత్ర యూనిట్ అయోధ్యకు విరాళం కూడా అందిస్తోంది.

అయోధ్యలో జరగనున్న మహోన్నత ఘట్టాన్ని పురస్కరించుకుని 'హనుమాన్' మూవీకి లక్కీ ఛాన్స్ వచ్చినట్లు తాజాగా తెలిసింది. అదేమిటంటే.. నార్త్ ఇండియాలో నేడు (జనవరి 22వ తేదీ) మరో 500 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితం కాబోతుందట. ఇప్పటికే ఈ షోలకు సంబంధించిన టికెట్ల బుకింగ్స్ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.

HanuMan Movie Theatres Increased In North India On The Occasion of Ayodhya Event

సాధారణంగా ఏదైనా సినిమా మంచి ప్రదర్శన చేస్తుంటే థియేటర్ల సంఖ్యను పెంచుతారు. అలాంటిది ఇప్పుడు నార్త్ ఇండియాలో 'హనుమాన్' మూవీకి సంబంధించి 500 థియేటర్లను ఒకేసారి పెంచేశారు. ఇలా గతంలో ఏ తెలుగు సినిమాకూ జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే రికార్డును నమోదు చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X