లవ్ యూ అంటూ...బన్నీకి చెర్రీ బర్త్ డే విషెస్ ఇలా.... (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు 33వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ బన్నీకి సెల్ఫీ పుల్లతో ఓ సెల్ఫీ ఫోటో తీసి విషెస్ తెలిపాడు. ఈ ఫోటోను తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పోస్టు చేసి శుభాకాంక్షలు తెలియజేసాడు రామ్ చరణ్.

స్టైలిష్ స్టార్‌గా, సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడగు పెట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా.... వారసత్వం ఉండటంతో బన్నీ ఎంట్రీ చాలా సులభంగానే జరిగింది.

తొలి చిత్రం ‘గంగోత్రి' రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడితో చేయడంతో తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు బన్నీ. ఈ చిత్రం మార్చి 28, 2003లో విడులైంది. గంగోత్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా తనతైన డాన్స్ టాలెంట్, యాక్షన్ పెర్ఫార్మెన్స్, సూపర్ అనిపించే నటతో.... స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు బన్నీ.

Happy B'day Bunny!!

ఆర్య చిత్రంతో ఫీల్ మై లవ్ అంటూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో విజయవంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హ్యాపీ, దేశ ముదురు, ఆర్య 2, వేదం, బద్రినాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం చిత్రాల్లో తనదైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకు సిద్దమవుతోంది. భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X