మోక్షజ్ఞ బర్త్‌డే నేడు, పాపులారిటీ పెరుగుతోంది

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రముఖ నటుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ ఓ వైపు చదువు కొనసాగిస్తూనే, మరో వైపు సినీ రంగ ప్రవేశానికి కావాల్సిన నటన, డాన్స్, ఫైట్స్ లాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ రోజు(సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులు పలు చోట్ల మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

కాగా...బాలయ్య తనయుడు ఇంకా సినిమా రంగంలోకి ప్రవేశించక ముందే ఆయనకు సినిమా రంగంలో వాడే ట్యాగ్ లైన్లు తగిలించేసారు అభిమానులు. బాలయ్యకు ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో 'నందమూరి నట సింహం' అనే పేరు ఉంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞకు 'యంగ్ లయన్' అనే ట్యాగ్ తగిలించారు.

Happy Birth day Nandamuri Taraka Rama Mokshagna Teja

ఈ మేరకు మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని 'యంగ్ లయన్' మోక్షజ్ఞ అంటూ పోస్టర్లు వెలిసాయి. మరో వైపు నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే 'యంగ్ టైగర్' ట్యాగ్‌తో జూ ఎన్టీఆర్ బాగా పాపులర్ అయిన సంగతి. మరి యంగ్ లయన్‌గా రాబోతున్న మోక్షజ్ఞ ఇండస్ట్రీలో...తండ్రి పేరును ఎలా నిలబెడతాడో చూడాలి.

కాగా...బాలయ్య సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం మోక్షజ్ఞ చదువు పూర్తయిన తర్వాతే అతను సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మోక్షజ్ఞకు మార్షల్ ఆర్ట్స్, డాన్స్, యాక్టింగులో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. స్టార్ హీరోల వారసులకు సినిమా రంగం ప్రవేశం సులభమే. అయితే వారు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునే అంశంపై వారి సక్సెస్ ఆధారి పడి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X