బర్త్‌డేన దుమ్ము దులిపిన ఎన్టీఆర్.. ఇండియాలోనే టాప్ హీరోగా... పవన్ రికార్డు మటాష్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తన అభిమానులు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నారు. రికార్డు స్థాయి ట్వీట్లతో కేక పెట్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ హీరోకు దక్కని విధంగా ఎన్టీఆర్‌ను టాప్ ట్రెండింగ్‌గా మార్చారు. ప్రస్తుతం #HappyBirthDayNTRను మే 19వ తేదీ సాయంత్రం ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. మే 20వ తేదీ ఉదయం వరకే ఆ హ్యాష్ ట్యాగ్ ఇండియాలోనే నంబర్ వన్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

#HappyBirthDayNTR Hashtag Top Trending In Twitter, Near To 20 Million Tweets
పవన్ రికార్డు తిరగరాసిన ఎన్టీఆర్

పవన్ రికార్డు తిరగరాసిన ఎన్టీఆర్

ఇప్పటి వరకు హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ (#HappyBirthdayPawanKalyan) టాప్‌గా నిలిచింది. దేశంలో ఏ హీరోకు దక్కని విధంగా బర్త్ డే హ్యాష్ ట్యాగ్ రికార్డు ట్వీట్లు సాధించింది. పవన్ కల్యాణ్ బర్త్ డే రోజున 10.51 మిలియన్ల ట్వీట్‌ సాధించి దేశంలోనే టాప్ హీరోగా నిలిచాడు. ఈ రికార్డును మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరగరాశారు.

మే 20వ తేదీ ఉదయానికే..

మే 20వ తేదీ ఉదయానికే..

తాజాగా పవన్ కల్యాణ్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ రికార్డులను యంగ్ టైగర్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ తిరగరాసింది. మే 20వ తేదీ ఉదయం వరకు 13.5 మిలియన్ల ట్వీట్లకుపైగా సాధించింది. ఇది ఇప్పటి వరకు బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ నంబర్ వన్ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

24 గంటల్లో 20 మిలియన్ల ట్వీట్ల లక్ష్యం

24 గంటల్లో 20 మిలియన్ల ట్వీట్ల లక్ష్యం

ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్ చూస్తే.. 24 గంటల్లోగా 20 మిలియన్ల ట్వీట్లను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే జరిగితే ఇండియా వైడ్ ట్రెండింగ్‌లో ఇదే గొప్ప రికార్డుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ స్టార్ స్టామినాకు అద్దంపడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ రేంజ్‌ ఎవరూ అందుకోని విధంగా మారే అవకాశం ఉంది.

 ఇండియాలో సౌత్ హీరోలే టాప్

ఇండియాలో సౌత్ హీరోలే టాప్

టాప్ హ్యాష్ ట్యాగ్ టెండ్రింగ్‌లో సౌత్ హీరోలే అగ్రస్థానంలో ఉన్నారు. బాలీవుడ్ హీరోలు ఎవరూ కూడా ఈ రేసులో లేకపోవడం గమనార్హం. తలా అజిత్ 8.4 మిలయన్లతో, సూపర్ స్టార్ మహేష్ 8.3 మిలియన్ల ట్వీట్లతో టాప్ ట్రెండింగ్‌గా నిలిచారు. సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా సౌత్ హీరోలే బలంగా ఉన్నారనడానికి ఇది ఉదహరణ అని చెప్పుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X