శ్రియ సినిమాల్లో ఆధునిక వస్త్రధారణతో కుర్రకారుని ఆకట్టుకొంటుంది. నవతరం నాయికగా అలా కెమెరా ముందుకు రావడం తప్పదు. అయితే ఆమెకు శాస్త్రీయ నృత్యమంటే ఎంతో మక్కువ. చిన్నప్పటి నుంచీ శోభనా నారాయణ్ దగ్గర కథక్ నృత్యం నేర్చుకొంది. 'సాగరసంగమం" లాంటి నత్య ప్రాధాన్యమున్న చిత్రం చేయాలన్నది శ్రియ తపన. అయితే ఆమెకు అవకాశం మాత్రం రావట్లేదు. ఈ మధ్య శ్రియ కూచిపూడి నృత్యం కూడా నేర్చుకొన్నది. ఉమా రామారావు అనే గురువు దగ్గర ఆమె ఈ నృత్యాన్ని అభ్యసించినట్టు తెలిసింది. కూచిపూడి కథక్ ల్లో ప్రావీణ్యం సంపాదించిన శ్రియ కోరిక మాత్రం ఇంకా తీరలేదు. అన్నట్టు ఈ రోజు తన పుట్టినరోజు. ఈ జన్మదిన వేడుకల్ని టోరంటోలో నిర్వహించుకొంటోంది. అక్కడ చిత్రోత్పవాల్లో పాల్గోనేందుకు శ్రియ వెళ్లింది. ఆమె నటించిన 'వాట్స్ కుకింగ్ స్టెల్లా" అనే ఆంగ్ల చిత్రాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నారు. మనం కూడా శ్రియ కు దట్స్ తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. మెనీ మోర్ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ద డే శ్రియా.