బర్త్ డే గాళ్.... ఐశ్వర్య రాయ్ అరుదైన ఫోటోస్
ముంబై: ప్రపంచ అందగత్తెల్లో మన భారతీయ అందం ఐశ్వర్య రాయ్‌ది ప్రత్యేక స్థానం. వలర్డ్ వైడ్‌గా తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఐష్ ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో మిసమిసలాడుతోంది. నేటితో ఐశ్వర్య 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఐశ్వర్య బచ్చన్ నవంబర్ 1వ తేది 1973వ సంవత్సరంలో జన్మించింది.
తన నటనా జీవితాన్ని ప్రారంభించక పూర్వం, ఆమె కొంతకాలం మోడలింగ్‌లో కొనసాగింది. ఆ క్రమంలోనే 1994లో విశ్వ సుందరి కిరీటాన్ని జయించిన తర్వాత పాపులర్ అయింది. తొలుత వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ లతో ప్రేమాయణం కొనసాగించిన ఐశ్వర్య రాయ్.... వారితో విడిపోయిన తర్వాత తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది.
వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 'ఆరాధ్య' జన్మించింది. ఐశ్వర్య రాయ్‌కి వన్ ఇండియా తెలుగు తరుపు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం.

ఐశ్వర్య
నేటితో ఐశ్వర్య 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

మోడలింగులో
9వ క్లాసులోనే ఐశ్వర్య రాయ్ మొడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

మొదటి యాడ్
ఐశ్వర్య రాయ్ మొదటి యాడ్ కామ్లిన్ పెన్సిల్స్ కోసం చిత్రీకరించారు.

సోనియా గాంధీతో
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెను కలిసిన ఐశ్వర్య రాయ్.

తొలి పోటీ
1991లో ఐశ్వర్య రాయ్ 17 సంవత్సరాల వయస్సులో తన స్నేహితురాలి బలవంతంతో ఫోర్డ్ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో పాల్గొంది. ఆమె ఫ్రెండ్ ఊహించినట్లే ఆ కాంటెస్టులో విజయం సాధించింది.

విశ్వసుందరి కిరీటం
1994 సంవత్సరం ఐశ్వర్యరాయ్ జీవితంలో మరిచిపోలేని సంవత్సరం. ఈ సంవత్సరమే ఆమె విశ్వ సుందరి కిరీటాన్ని ఐశ్వర్యరాయ్ జయించింది.

తొలి చిత్రం
మణిరత్నం దర్శకత్వంలో 1997లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇరువర్' ద్వారా ఐశ్వర్య రాయ్ సినీ రంగ ప్రవేశం చేసింది.

బాలీవుడ్ దృష్టిలో
ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ దృష్టిలో పడినది హమ్ దిల్ దే చుకే సనం (1999) అనే చిత్రంతో, సంజయ్ లీలా భన్సాలి చే దర్సకత్వం వహించారు. ఆ చిత్రంలో ఆమె నటనకి ఆమె ఫిలిం ఫేర్ ఉత్తమ నటీమణి పురస్కారం ను పొందినది.

దేవదాసు
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన దేవదాస్ (2002)లో నటించిన ఐశ్వర్య తన రెండో ఫిలిం ఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది.

ప్రేమలో పడ్డారు
జెపి దత్తా ఉమ్రో జాన్ చిత్రంలో కలిసి నటించిన అభిషేక్, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు.

పెళ్లి నిర్ణయం
గురు సినిమా సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అ సందర్భంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పుడే ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది.

అభిషేక్ వయసులో చిన్న
తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో జనవరి 14, 2007న ఎంగేజ్ మెంట్ జరిగింది.

రొమాంటిక్ మూమెంట్
ఏప్రిల్ 20, 2007న ఐష్-అభిషేక్ వివాహం జరిగింది. వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ రొమాంటిక్ మూమెంటును ఇక్కడ ఫోటోలో చూడొచ్చు.

మొదటి పెళ్లి రోజు వేడుకలో
ఈ సినీ జంట తమ మొదటి పెళ్లి రోజును ముంబైలో ఘనంగా జరుపుకున్నప్పటి దృశ్యామిది.

అమ్మగా..
2011 నవంబర్లో అభిషేక్-ఐశ్వర్యలకు ఆరాధ్య జన్మించంది.

మామతో కలిసి సెప్స్
ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ మామ అమితాబ్ పాట పాడుతుంటే...ఐశ్వర్యరాయ్ స్టెప్పులేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సంజయ్ లీలా బన్సాలీతో ఐష్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ గుజారిష్ చిత్రంలో నటిస్తున్నప్పటి ఆన్ లొకేషన్ స్టిల్ ఇది.

రితేష్ దేష్ ముఖ్‌తో ఐశ్వర్యరాయ్
ఓ సినిమా కార్యక్రమంలో తన తోటి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌తో కలిసి ఐశ్వర్యరాయ్ స్టెప్పులు వేస్తున్న దృశ్యం.

మాధురి దీక్షిత్ తో ఐశ్వర్య రాయ్
ఐశ్వర్యకంటే ముందు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన భామ మాధురి దీక్షిత్. మాధురి దీక్షిత్‌తో ఐశ్వర్యకు మంచి స్నేహబంధం ఉంది. అందకు ఈ ఫోటోయే నిదర్శనం.

మామయ్య అమితాబ్ తో ఐష్
బాలీవుడ్ మెగాస్టార్, మామయ్య అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఐశ్వర్యరాయ్ వెలుతున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు.

పుట్టినరోజు శుభాకాంక్షలు
ఐశ్వర్య రాయ్ కి వన్ ఇండియా తెలుగు తరుపున పుట్టన రోజు శుభాకాంక్షలు


Click it and Unblock the Notifications











