twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముద్దుగుమ్మకు హ్యాపీ బర్త్ డే విషస్స్

    By Staff
    |

    భూమికా చౌలా 21 ఆగస్టు 1978 పుట్టింది. ఆమె చైల్ హుడ్, స్టడీస్ అంతా డిల్లీ లోనే. భూమికా చౌలా క్యూట్ గా, సింపుల్ గా, చిన్ని నవ్వతో ఏ సినిమాలో యైనా గ్రేస్పుల్ మూమెంట్స్ తో కనిపిస్తూ ఉంటుంది. చాలా కొద్ది సంవత్సరాలలోనే సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ గా మంచి స్థానాన్ని సంపాదించుకొన్నది. మెదట తను పాండ్స్ పౌడర్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా పాపులర్ అయింది.

    1997లో డిల్లీ నుండి ముంబాయ్ కివచ్చి సినిమా కెరీర్ ను ప్రారంబించినది. తన మొదటి సినిమా 'యువకుడు' 2000లో రిలీస్ అయింది. తర్వాత సూపర్ హిట్ తెలుగు సినిమా 'ఖుషి' సినిమాలో 'పవన్ కళ్యాణ్' సరసన హీరోయిన్ గా నటించి' తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన భూమిక తన కెరియర్ ప్రారంభించి దాదాపు పదియేళ్ళయ్యింది చిత్ర ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ని సంపాదించుకొంది. ఈ సినిమాకు 'ది బెస్ట్ యాక్టర్ అవార్డు' ను కైవసం చేసుకొన్నది. తర్వాత వెనుదిరిగి చూడలేదు వరుస ఆఫర్లతో తెలుగు, తమిళ్ సినిమాలలో నటించింది. తెలుగు, తమిళ్ భాషల్లోనే కాక హిందిలో 2003 లో సూపర్ హిట్ ఫిల్మ్ 'తెరేనామ్', 'సల్మాన్ ఖాన్' సరసన, తర్వాత 'రన్' సినిమాలో 'అభిషేక్ భచ్చన్' సరసన నటించింది. సినిమాలో తన పెర్పామెన్స్ తో ఏ పని చేసినా క్యారక్టర్ లో లీనమై సింపుల్ గా ఎంజాయ్ చేస్తూ పనిని ముగిస్తుంది. భూమిక తను ఎక్స్ పోజింగ్ తావివ్వకుండా గ్లామరస్ రోల్స్ నే ఎక్కువ గా ఎంచుకొంటుంది.

    తను ఆర్టిస్ట్ మాత్రమే కాదు పొయట్టిస్ట్ కూడా, ఇప్పటికే తను 100 పోయంస్ వరకూ రాసిందట. చిరకాల స్నేహితుడు, యోగా గురువైన భరత్ ఠాకూర్ ను అక్టోబర్ 2007లో వివాహం చేసుకొన్నది. పెళ్ళి చేసుకొని కూడా తన కెరియర్ని సక్సెస్ పుల్ గా కొనసాగిస్తోంది భూమిక. అ ఇటీవల ఒక సందర్భంలో మీడియాతో ముచ్చటించిన భూమిక - మరో పదేళ్ళు నా కెరియర్కి ఢోకి లేదు. ఇప్పుడు హీరోలుగా రంగప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ, నాగచైతన్య, రానాల సరసన కథానాయికగా నటించమని నన్నడిగినా నేను రెడీయే అంటున్నది.

    భూమికా చౌలా ఒక్కడు, మిస్సమ్మ, సాంబ, సింహ్మాద్రి, నా ఆటోగ్రాఫ్, జై చిరంజీవ, మంత్ర, అనసూయా, మల్లెపువ్వు, సినిమా లలో నటించి తన ప్రతిభ పాటవంతో సినిమా ఇండస్ట్రీలో మంచి స్థాన్నాన్ని సంపాధించుకొన్నది. ప్రస్తుతం తను అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో యాగం సినిమా లో నటిస్తున్నది. భూమికా మరెన్నో సినిమాలలో నటించి విజయాలను సాదించాలని ఆశిస్తూ, తనకి 31 జన్మదిన శుభాకాంక్షలు దట్స్ తెలుగు తరపున తెలియ జేస్తున్నాము.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X