‘దమ్ము’న్న డైరెక్టర్ పుట్టినరోజు నేడు
సూపర్ హిట్ మాస్ చిత్రాల దర్శకుడిగా, మాస్ ప్రేక్షకుల పల్స్ పర్ ఫెక్టుగా పసిగట్టే టాలెంట్ ఉన్న వ్యక్తిగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ రోజు(ఏప్రిల్ 25) బోయపాటి పుట్టిన రోజు.
2005లో భద్ర చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన బోయపాటి తొలి సినిమాతోనే సూపర్ హిట్ మాస్ సక్సెస్ సాధించాడు. 2007లో ఆయన రూపొందించిన తులసి చిత్రం వెంకట్ కెరీర్లో మంచి మాస్ హిట్ గా నిలిచింది. 2010లో బాలయ్య హీరోగా రూపొందించిన 'సింహా' బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.
తాజాగా బోయపాటి జూ ఎన్టీఆర్ హీరోగా 'దమ్ము' చిత్రం రూపొందించారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటించారు. కీరవాణి సంగీతం అందించారు. కెఎస్ రామారావు సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మించారు.
'దమ్ము' చిత్రం బోయపాటి కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ హిట్‌గా నిలవాలని, ఆయన మరిన్ని మాస్ హిట్లతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తూ....వన్ ఇండియా తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











