twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Praveen Sattaru: కోట్ల రూపాయలు వచ్చే జాబ్ ను వదిలేసి దర్శకుడిగా మారిన కుర్రాడు

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ దర్శకుల లిస్టు పెద్దగానే ఉంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనగానే ఒక కామెంట్ నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. ఏ పని పాట లేని వాళ్ళు ఎక్కువగా తిరిగే ఇండస్ట్రీ అంటూ అవివేకంతో మాట్లాడేస్తుంటారు. కానీ ఇండస్ట్రీలో చాలామంది చదువుకున్న మేధావులు కూడా ఉన్నారు. అందులో ప్రవీణ్ సత్తారు లాంటి దర్శకుడు ఒకరు.అతను చేసిన సినిమాలతోనే టాలెంట్ ఏమిటో క్లారిటీగా అర్ధమయ్యింది.

    అమెరికాలో సంవత్సరానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే IBM లో ఉద్యోగాన్ని వదిలేసి దర్శకుడిగా మారాడు. ప్రవీణ్ సత్తారు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో జన్మించారు. అతను చిప్ డిజైనింగ్‌లో ఎంఎస్ డిగ్రీని కలిగి ఉన్నాడు. ఇక ఐబిఎమ్‌లో సుమారు 10 సంవత్సరాలు SAP కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ప్రవీణ్ అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించాడు.

    Happy birthday day Praveen Sattaru career behind the story

    లవ్, లైఫ్, రొమాన్స్, యాక్షన్ వంటి జానర్స్ ను చాలా తొందరగానే టచ్ చేశాడు. మొదట LBW(లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) అనే సినిమాతోనే ఇండస్ట్రీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అనంతరం చందమామ కథకు సినిమాతో నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు.

    గుంటూరు టాకీస్ PSV గారుడవేగ వంటి విభిన్నమైన సినిమాలను చేసి కమర్షియల్ దర్శకుడిగా కూడా తన రేంజ్ ను పెంచుకున్నాడు. ఇక తమన్నాతో ఇటీవల 11th హావర్ అనే వెబ్ సిరీస్ ను కూడా డైరెక్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం నాగార్జునతో చేయబోయే తదుపరి సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందనున్న ఆ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే విధంగా ప్రవీణ్ భవిష్యత్తులో మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్టులను సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

    English summary
    Praveen Sattaru is an Indo-American film director, screenwriter and producer, known for his works in Telugu cinema. He made his directorial debut with the 2011 film, Life Before Wedding:LBW.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X