For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday DSP: దేవీ శ్రీ ప్రసాద్ టాలీవుడ్ రికార్డు: ఆ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్.. ఎంతంటే!

  |

  సినీ ఇండస్ట్రీలో సాధారణంగా హీరోలకో, హీరోయిన్లకో, డైరెక్టర్లకో అభిమానులు ఉంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లను అభిమానించే, ఆరాధించే అభిమానులు కొన్ని కోట్లలో ఉంటారు. అదే స్థాయిలో ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కు కూడా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. అవును.. అతడే రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. అద్భుతమైన పాటలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అతడు.. టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు. ఈరోజు డీఎస్పీ బర్త్‌డే. ఈ సందర్భంగా అతడి గురించి స్పెషల్ ఆర్టికల్ మీకోసం!

   అలా పరిచయం.. సినిమానే తన పేరు

  అలా పరిచయం.. సినిమానే తన పేరు

  ‘డ్యాన్స్ పార్టీ' అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో కంపోజర్‌గా తన కెరీర్‌ను ఆరంభించాడు దేవీ శ్రీ ప్రసాద్. ఈ క్రమంలోనే 1999లో వచ్చిన ‘దేవీ' అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈ ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అతడికి మంచి పేరు వచ్చింది. ఈ కారణంగానే సినిమా పేరునే తన పేరులో చేర్చుకున్నాడు. దీంతో దేవీ శ్రీ ప్రసాద్‌గా మారాడు.

  Evaru Meelo Koteeswarulu నుంచి ఊహించని ప్రకటన: తారక్ డైలాగ్స్ కేక.. ప్రోమోనే ఇలా ఉంటే షో ఎలా!

   దేవీ ఉంటే సినిమా సగం హిట్లే అనేలా

  దేవీ ఉంటే సినిమా సగం హిట్లే అనేలా

  ఆరంభంలో చిన్న చిన్న సినిమాలకు మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్.. ఆ తర్వాత తన రేంజ్‌ను పెంచుకున్నాడు. అంతేకాదు, అతడు మ్యూజిక్ ఇస్తే సినిమా సగం హిట్ అయినట్లే అని టాక్ వచ్చేంతగా పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే మరింత ఉత్సాహంగా పని చేస్తూ కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నాడు. దీంతో టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు.

  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. స్టార్లకు సాంగ్స్

  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. స్టార్లకు సాంగ్స్

  టాలీవుడ్‌లో ఒక ఏడాదిలో దాదాపు పది సినిమాలకు కూడా మ్యూజిక్ అందించాడు దేవీ శ్రీ ప్రసాద్. అంతలా అతడి ప్రభావం కనిపించింది. మరీ ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్, మహేశ్, పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ వంటి స్టార్లకు సైతం మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో హిట్ ఆల్బమ్‌లు ఇచ్చాడు.

   అన్ని భాషల్లో చేసిన కంపోజర్‌గా సత్తా

  అన్ని భాషల్లో చేసిన కంపోజర్‌గా సత్తా

  తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. వేరే భాషల్లోనూ తన సత్తాను చూపించాడు. మరీ ముఖ్యంగా తమిళం, కన్నడం, హిందీ, బెంగాలీ భాషల్లో పలు చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. అంతేకాదు, తన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించాడు. ఇవి మాత్రమే కాదు... లిరిసిస్టుగానూ కొన్ని సూపర్ డూపర్ హిట్ పాటలను రాసి ఆల్‌రౌండర్ అనిపించాడు.

   గుడ్ కమ్‌బ్యాక్.. ఇప్పుడు ఫుల్ బిజీగా

  గుడ్ కమ్‌బ్యాక్.. ఇప్పుడు ఫుల్ బిజీగా

  కొంత కాలంగా టాలీవుడ్‌లో దేవీ శ్రీ ప్రసాద్ మార్క్ పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఉప్పెన' సినిమాతో అతడు అదిరిపోయేలా కమ్‌బ్యాక్ అయ్యాడు. ఈ సినిమాను తన సంగీతంతో హిట్ చేశాడు. దీంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ చేతిలో ఏకంగా పది చిత్రాల వరకూ ఉన్నాయి.

  బుల్లితెర కపుల్స్ సీక్రెట్స్: వీళ్ల మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా?.. వాళ్లేమంటున్నారంటే!

  Kathi Mahesh మరణంపై అనుమానాలు? ఆక్సిజన్ పైప్ పీకేశారా? || Filmibeat Telugu
   ఆ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్

  ఆ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్


  దేవీ శ్రీ ప్రసాద్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి చాలా కాలంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం అతడు భారీగా చార్జ్ చేయడమే. తాజా సమాచారం ప్రకారం.. డీఎస్పీ ఒక్కో సినిమాకు రూ. 3.50 - 4 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. అంటే మీడియం రేంజ్ హీరోల రెమ్యూనరేషన్‌కు ఇది సమానం. అయినప్పటికీ దర్శక నిర్మాతలు అతడి కోసం వెనుకాడడం లేదు.
  అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను నూరేళ్ల పాటు ఉర్రూతలూగించాలని కోరుకుంటూ.. ఫిల్మీబీట్ తరపున దేవీ శ్రీ ప్రసాద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Tollywood Top Music Director Devi Sri Prasad Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know Rare Records of his Career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X