పుట్టిన రోజు సందర్బంగా రూటు మార్చిన గోపీచంద్
గోపీచంద్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా తెర మీద యాక్షన్ ఘట్టాలే గుర్తొస్తాయి. 'అన్నా' అని పిలిచే చెల్లాయికి అండగా నిలబడే అన్నయ్య... 'నా' అనుకొనేవారిని ఆదుకొనే ఆపద్భాంధవుడు... కర్తవ్యం మరచిపోని పోలీసు అధికారి - ఇలాంటి పాత్రల్ని రక్తికట్టించారు గోపీచంద్. 'యజ్ఞం', 'ఆంధ్రుడు', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం'... ఈ సినిమాలన్నీ గోపీచంద్‌లోని యాక్షన్ కోణాన్ని బయటపెట్టాయి.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆ సినిమానే 'మొగుడు'. తాప్సి కథానాయిక. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. వివాహం, కుటుంబ బంధాలు... వీటి చుట్టూ సాగే కథ ఇది. చూస్తుంటే గోపీచంద్ కూడా రూటు మార్చి ప్రయాణం సాగిస్తున్నట్టే అనిపిస్తోంది. ఈ కొత్త పాత్రలో గోపీ ఎంత వరకూ ఒదిగిపోతారో చూడాలి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. అన్నట్టు ఆదివారం గోపీచంద్ పుట్టిన రోజు.


Click it and Unblock the Notifications











