twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిత్యసంగీత సాధకుడు ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు..!

    By Sindhu
    |

    రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దు:ఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసును తాకితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో వినసొంపైన స్వరాలను ఏరి కూర్చి పాటల మాలను కట్టే మ్యూజిక్ మ్యాస్ట్రో పద్మభూషన్ ఇళయరాజా పుట్టినరోజు ఈ రోజు. ఇళయరాజ మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోవడమేకాక, 2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

    1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించిన ఇళయరాజ ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన నేడు భారతదేశ సంగీత దర్శకులలో ఒకరిగా ఎదిగారు..1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని 'చిన్ని చిన్ని కన్నయ్య" అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేసారు. తెలుగులో 'భద్రకాళి'కి తొలిసారి సంగీత దర్శకత్వం వహించినా, ఎన్టీఆర్‌ నటించిన 'యుగంధర్‌' మొదట విడుదలయింది.

    నిత్య సంగీత సాధకుడుగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయనకు అలవాటు అయింది. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ. ఇళయరాజ సంగీతం వింటుంటే ఎవరైనా సరే అమాంతం తన్మయత్వం అయిపోవాల్సిందే. అంతటి ఘనత ఆయనది. ఆయన ఇప్పటి వరకు నాలుగు వేల పాటలకు, ఎనిమిదివందల చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన సుస్వరాలో తేలియాడని సంగీతాభిమాని ఉండరనడంలో అతిశయోక్తి కాదేమో! మరి ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు దట్స్ తెలుగు తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X