»   » కాజల్ 30, ముదిరిపోయినట్లేనా? (ఫోటో ఫీచర్)

కాజల్ 30, ముదిరిపోయినట్లేనా? (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లక్ష్మి కళ్యాణ్ చిత్రం ద్వారా తెలుగులో తెరంగ్రేటం చేసిన హీరోయిన్ కాజల్ 'చందమామ' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా అలా సాగుతున్న కాజల్ సినీ కెరీర్ 'మగధీర' బంపర్ హిట్ తో దశ తిరిగింది. ఆ దెబ్బతో తెలుగులో వరుస అవకాశఆలతో టాప్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది.

పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్నా.... వారితో పోపడుతూ ఇటు నటన పరంగా, అటు గ్లామర్ పరంగా ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకుంటూ దూసుకెలుతున్న మిత్రవింద...ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. 1985, జూన్ 19న జన్మించిన కాజల్ వయసు నేటితో 29 వసంతాలు పూర్తి చేసుకుని 30వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

కాజల్ సినిమాల విషయానికొస్తే.. కాజల్ చివరి సారిగా తెలుగులో 'ఎవడు' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తోంది. త్వరలో జూ ఎన్టీఆర్-పూరి కాంబినేషన్లో రాబోతున్న (కుమ్మేస్తా) సినిమాలో నటించబోతోంది. దీంతో పాటు ఓ తమిళం, ఓ హిందీ సినిమాలో నటిస్తోంది.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ' కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది. ఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. కాజల్ కు తొలి కమర్షియల్ హిట్

మగధీర సినిమాతో...

మగధీర సినిమాతో...

2009లో మెుగాస్టార్ చిరంజీవి తనయుడైన రామ చరణ్ తేజ తో రాజమౌలి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.

వరుస సినిమాలు

వరుస సినిమాలు

2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరవాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో, జూ ఎన్టీఆర్‌తో బాద్ షా, రామ్ చరణ్‌తో నాయక్, రవితేజతో ‘సారొచ్చారు' చిత్రాల్లో నటించింది.

తమిళ సినిమాల్లో కూడా..

తమిళ సినిమాల్లో కూడా..

తెలుగులో మాత్రమే కాదు...పలు తమిళ చిత్రాల్లోనూ కాజల్ నటించింది. అక్కడ కూడా ఆమె స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది.

బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ ఎంట్రీ

‘సింగం' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్, ఆ తర్వాత ‘స్పెషల్ 26' సినిమాలో నటించింది. అయితే దక్షిణాది మాదిరి అక్కడ నిలదొక్కుకోలేక పోయింది. ప్రస్తుతం అజయ్ వర్మ తీస్తున్న బాలీవుడ్ ప్రాజెక్టులో ఎంపికయింది.

English summary
Today is the birthday of hot beauty Kajal Aggarwal. Kajal Aggarwal is an Indian actress, who predominantly appears in Telugu and also in Tamil films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu