యువసామ్రాట్ నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు

By Staff

తెలుగు సినిమాలు ఎప్పుడూ ఒకే విధంగా మూసధోరణితో వుండకుండా న్యూ ఎక్స్ పిరిమెంట్స్ చేసే హీరోలలో మొదటి వరుసలోవుండే హీరో అక్కినేని నాగార్జున. యువసామ్రాట్ ఇదే వరసక్రమంలో ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్లని తెలుగు పరిశ్రమకు అందించిన ఘనతని దక్కించుకున్నారు.ఈ కోవలోనే యువ దర్శకునిగా కిరణ్ పరిచయం చేస్తూ ఒక కొత్త గెటప్ లో (గ్యాంబులర్)గా మన ముందుకు రాబోతున్నారు ఈ సందర్బంగా యువసామ్రాట్ అక్కినేని నాగార్జునకి దట్స్ తెలుగు తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెపుతున్నాము. యువసామ్రాట్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఈ రోజు(ఆగష్టు 29). ఈ సందర్భంగా, నాగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, నాగ్ తో అభిమానులు ఈ పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

ఈ సంవత్సరం ఆయన పుట్టి రోజు సందర్బంగా తన తనయుడు నాగచైతన్య ఒక మంచి బహుమతిని జోష్ ఎంట్రీతో ఇయ్యబోతున్నారు. ఇక తన 22 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో నాగార్జున ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు. తన కెరీర్ సంతృప్తికరంగా సాగిపోతోందని నాగార్జున అంటున్నారు. శివ, గీతాంజలి, నిన్నేపెళ్ళాడతా, మన్మధుడు, అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు నాగార్జున సినీ జీవితంలో మరువలేని మరుపురాని చిత్రాలు అని చెప్పాలి.

నాగార్జున క్లాస్, మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. మల్టీస్టారన్ చిత్రాలు కావాలి రావాలి అనే వారిలో నాగార్జున ఒకరు. ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్.లు కలిసి ఎన్నె చిత్రాలు నటించారని మనం కూడా వారిబాటలో పయనించడానికి సంకొచించడం ఎందుకని ప్రశ్నిస్తారు. తనవరకు మళ్టీస్టారర్ చిత్రాలలో నటించడానికి ఎప్పుడైనా రెడీ అని అంటూనే విష్ణుతో కలిసి ఓ చిత్రంలో నటించనున్న విషయాన్ని చెబుతున్నారు.

జోష్ విషయానికి వస్తే పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు... జనులు అతనిని ప్రశంసించినప్పుడు కలుగుతుందంటారు. ప్రస్తుతం నాగార్జున 'జోష్" ద్వారా తన కుమారుడు నాగచైతన్య ఎలాంటి ప్రశంసలు అందుకోనున్నాడనే విషయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన తొలి చిత్రం విక్రమ్ కి కూడా ఇంత టెన్షన్ పడలేదని నాగార్జున అన్నప్పుడు కుమారుడి కెరియర్ పట్ల ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతోంది. ఎనీహౌ యువసామ్రాలట్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆశించిన మేరకు నాగచైతన్య విజయం సాధించాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X