twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Mahesh Babu: డిజాస్టర్స్ వెక్కిరిస్తే.. బాక్సాఫీస్‌కే ప్రిన్స్‌లా.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే?

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా అభిమానుల్లో ప్రేమను అంతకంతకు పెంచుకుంటూనే ఉంటున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకునేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను అయితే సెట్ చేసుకున్నాడు. కేవలం సినిమాల తోనే కాకుండా ఎన్నో సామాజిక సేవలతో కూడా తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఆడుకునే వయసులోనే యాక్టింగ్ తో ఇరగదీసిన మహేష్ బాబు తన సినిమా కెరీర్ ను ఒక క్రమ శిక్షణతో సెట్ చేసుకున్నాడు. ఒక విధంగా డిజాస్టర్స్ వెక్కిరించిన ప్రతిసారి కూడా మహేష్ బాక్సాఫీస్ మొగుదయ్యాడు అని అభిమానులు కాలర్ ఎగరేసేలా చెప్పుకుంటారు. ఇక తండ్రి నుంచి సినిమాపను ఎంతో బాధ్యతగా చూడాలని ఎంత స్టార్ హోదా పెరిగినా ఒకే తరహాలో ఒదిగి ఉంటున్నాడు.

    బర్త్ డే బ్లాస్టర్

    బర్త్ డే బ్లాస్టర్

    ఇక నేడు మహేష్ బాబు 45వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సూపర్ స్టార్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    సాధారణంగా మహేష్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయితేనే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రికార్డులు నమోదు అవుతాయి ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సర్కారు వారి పాట కూడా కూడా బర్త్ డే బ్లాస్టర్ టీజర్ కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో ట్రెండ్ సెట్ చేసే వైరల్ అవుతోంది. ఈ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సినిమా కెరీర్ పై ఒక లుక్కేస్తే..

    సమ్మర్ హాలిడేస్ లో సినిమాలు

    సమ్మర్ హాలిడేస్ లో సినిమాలు

    1975 ఆగస్టు 9న మద్రాస్ లో జన్మించిన ఘట్టమనేని మహేశ్ బాబు చిన్నతనం నుంచే నటనను చాలా ఈజీగా అలవాటు చేసుకున్నాడు. సమ్మర్ లో హాలిడేస్ రాగానే మొహానికి రంగు వేసుకొని కెమెరా ముందు తనదైన శైలిలో ఆకట్టుకునేవారు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొన్నేళ్ళ పాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మహేష్ బాబు ఘట్టమనేని స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్లారు. మహేష్ బాబు 15 ఏళ్ళ వయసులోకి రాకముందే 1979 నీడ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు. 1983లో కృష్ణ పోరాటం సినిమాలో అసలైన సినీ ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ సినిమాల్లోనే చాలా రకాల పాత్రలు చేశాడు. 1990 బాలచంద్రుడు సినిమాతోనే లీడ్ యాక్టర్ మరోసారి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు.

     హీరోగా మొదటి రెమ్యునరేషన్

    హీరోగా మొదటి రెమ్యునరేషన్

    1991 అనంతరం ఉన్నత చదువులతో బిజీగా మారిన మహేష్ బాబు మళ్ళీ 8 ఏళ్ళ తరువాత 1999లో రాజకుమారుడు సినిమాతో స్టార్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ది.అశ్వినీదత్ సినిమాను నిర్మించారు. మొదటసారి హీరోగా మహేష్ బాబు అసలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోవద్దని అనుకున్నాడట. అయినప్పటికీ అప్పట్లో మహేష్ బాబు మొదటి సినిమా కోసం ఎంతో మంది నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఎంతో అనుభవం ఉన్న వైజయంతి సి.అశ్వినిదత్ చేతిలోనే మహేష్ బాబు హీరో ప్రస్థానాన్ని మొదలు పెట్టించారు. ఆ సినిమా కోసం మహేష్ కేవలం 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో మంచి రెమ్యునరేషన్ తీసుకున్నాడట.

     వరుసగా అపజయాలు

    వరుసగా అపజయాలు

    తండ్రి మాటను ఏమాత్రం జవదాటకుండా అనవసరమైన సమయంలోనే సినిమాలు చేస్తూ మిగతా సమయాన్ని చదువుకు కేటాయించేవాడు. చిన్నతనంలో ఎక్కువగా సమ్మర్ హాలిడేస్ వస్తేనే మహేష్ బాబు చాలా ఫాస్ట్ గా షూటింగ్ పనులు పూర్తి చేసుకునేవాడు. హీరోగా కెరీర్ మొదట్లో వారుసగా మూడు సినిమాలు ఫాస్ట్ చేసినప్పటికీ అంతగా హిట్ అవ్వలేదు.ఇక 2001 సంవత్సరంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా ద్వారా మహేష్ బాబు మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత వెంటవెంటనే టక్కరి దొంగ, బాబీ సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ అవి అంతగా కలిసి రాలేదు

     ఒక్కడు సినిమాతో స్టార్ హోదా

    ఒక్కడు సినిమాతో స్టార్ హోదా

    ఇక 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన మొదటి సినిమా ఒక్కడు బాక్సాఫీస్ రికార్డులను ఒక్కసారిగా బ్లాస్ట్ చేసింది. ఆ సినిమాతో మహేష్ బాబులో కూడా మంచి యాక్షన్ హీరో ఉన్నాడని రుజువయ్యింది. ఆ సినిమాతోనే సూపర్ స్టార్ కు మాస్ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువ అవుతూ వచ్చారు. మహేష్ బాబు అప్పట్లో ఒక సక్సెస్ అందుకున్న తర్వాత వెంటవెంటనే ఊహించని విధంగా డిజాస్టర్స్ వచ్చేవి. అయినప్పటికీ మహేష్ మాత్రం నిరాశ చెందకుండా తనదైన శైలిలో ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. నాని, నిజం, అతడు వంటి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వచ్చాడు.

    ఇండస్ట్రీ హిట్

    ఇండస్ట్రీ హిట్

    పోకిరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో మహేష్ బాబు డైలాగ్స్ తోనే రికార్డులు బ్లాస్ట్ అయ్యాయి. దూకుడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. ఇక మధ్యలో వన్-నేనొక్కడినే, ఆగడు సినిమాలు తీవ్రంగా నిరాశ పరచడంతో అనంతరం వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చేసిన శ్రీమంతుడు సినిమా చేసి మరొక ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ద్వారా మహేష్ బాక్సాఫీస్ స్థాయి కూడా మరింత పెరిగింది.

    Recommended Video

    Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP
     ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎంతంటే?

    ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎంతంటే?

    భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించాయి. మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రస్తుతం ఆ సినిమాలు ఈజీగా రెండు వందల కోట్ల మార్కెట్ ను అందుకుంటున్నాయి. మహేష్ బాబు తో దాదాపు అందరు హీరోలు కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ జల్సా- ఎన్టీఆర్ బాద్షా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు 50కోట్లకు పైగానే పారితోషికాన్ని అందుకుంటున్నాడు. నెక్స్ట్ సర్కారు వారి పాట అనంతరం , త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి వంటి స్టార్ దర్శకుల ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు.

    English summary
    Tollywood supar star Happy Birthday Mahesh Babu career best hits and remuneration details,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X