twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Chiranjeevi: చిరంజీవిని స్టార్‌ను చేసిన సినిమా అదే.. అలా చేసిన ఏకైక ఇండియన్ హీరో

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. ఎన్నో కష్టానష్టాలను అనుభవించి.. ఎత్తుపల్లాలను చూసిన తర్వాత ఉన్నత స్థానానికి చేరుకుని స్టార్ హీరోగా మారారు. ఎన్టీఆర్.. ఏఎన్నార్ జనరేషన్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉన్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని అంశాలను గుర్తు చేసుకుందాం పదండి!

    Recommended Video

    Megastar Chiranjeevi ఇండియన్ సినిమాకి ‘బ్రేక్‌ డ్యాన్స్‌' పరిచయం చేసిన స్టార్ || Filmibeat Telugu
    మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నేపథ్యం

    మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నేపథ్యం

    మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్‌. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావు, తల్లి అంజనాదేవి. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. అందులో చిరంజీవి మొదటివారు. మిగిలిన ఇద్దరు నాగేంద్రబాబు, పవన్‌కల్యాణ్‌. 1980లో ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో కొడుకు హీరోగా రాణిస్తుండగా.. సుస్మిత కూడా ఇప్పుడే నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు.

    అలా పరిచయం.. కెరీర్‌ను మార్చింది

    అలా పరిచయం.. కెరీర్‌ను మార్చింది

    మెగాస్టార్ చిరంజీవి 1978లో 'పునాదిరాళ్లు' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 1983లో కోదండరామ్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఖైదీ' అనే సినిమా.. చిరంజీవిని కెరీర్‌ను మార్చేసింది. ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పట్లోనే ఈ సినిమాతో 4 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ మూవీతోనే చిరంజీవికి స్టార్ స్టేటస్ కూడా దక్కింది. అప్పటి నుంచి ఈయన వెనుదిరిగి చూడకుండా దూసుకుపోయారు.

    చిరు కెరీర్‌కు ప్లస్ అయిన చిత్రాలివే

    చిరు కెరీర్‌కు ప్లస్ అయిన చిత్రాలివే

    'ఖైదీ' సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను అందుకున్న తర్వాత చిరంజీవి ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. వాటిలో 'చంటబ్బాయ్‌', 'ఛాలెంజ్‌', 'అభిలాష', 'శుభలేఖ', 'గ్యాంగ్‌ లీడర్‌', 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు', 'స్వయం కృషి', 'రుద్రవీణ', 'ఆపద్భాందవుడు', 'యముడికి మొగుడు', 'అత్మకు యముడు.. అమ్మాయికి మొగుడు', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'చూడాలని ఉంది', 'బావగారూ బాగున్నారా!' 'ఇంద్ర', 'ఠాగూర్‌', 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌', 'ఖైదీ నెంబర్ 150' సహా ఇటువంటి మరెన్నో చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.

    రాజకీయ ప్రయాణం మాత్రం నిరాశగా

    రాజకీయ ప్రయాణం మాత్రం నిరాశగా

    సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి హఠాత్తుగా రాజకీయాల వైపు వెళ్లారు. 2008 ఆగస్టులో 'ప్రజా రాజ్యం' పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 295 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి 18స్థానాల్లో గెలుపొందారు. 2011 ఫిబ్రవరిలో 'ప్రజా రాజ్యం' పార్టీని 'కాంగ్రెస్‌'లో వీలీనం చేశారు. ఆ తర్వాత 2012 మార్చిలో రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. కేంద్ర పర్యాటకశాఖా మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవీ కాలం పూర్తైన తర్వాత నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

    అలా రీఎంట్రీ.. ఫుల్ జోష్‌తో మూవీలు

    అలా రీఎంట్రీ.. ఫుల్ జోష్‌తో మూవీలు

    రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి.. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో చిరు నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాను చేశారు. ఇది అంతగా ఆకట్టుకోలేదు. కానీ, ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కొరటాలతో 'ఆచార్య' అనే మూవీని పూర్తి చేసిన ఆయన.. ప్రస్తుతం మోహన్ రాజాతో 'లూసీఫర్' రీమేక్, మెహర్ రమేష్‌తో 'వేదాళం' రీమేక్, బాబీతో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ నేడు రానున్నాయి.

    చిరుకు దక్కిన అవార్డులు, గౌరవాలు

    చిరుకు దక్కిన అవార్డులు, గౌరవాలు


    సుదీర్ఘమైన సినీ జీవితంలో మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు, గౌరవాలు దక్కాయి. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌ పురస్కారంతో ఆయనను సత్కరించింది. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. వీటితో పాటు ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచిన మెగాస్టార్ చిరంజీవికి అనేక జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు ఆయనను వరించాయి. అలాగే, ఈ సినీ ప్రయాణంలో చిరంజీవి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోగా వెలుగొందుతున్నారు.

    వాటితో ప్రాణదాత అయిన ‘అన్నయ్య’

    వాటితో ప్రాణదాత అయిన ‘అన్నయ్య’


    సినిమాల్లో సత్తా చాటుతూ నెంబర్ వన్ హీరోగా మారిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రజాసేవపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అప్పట్లో రక్తం లేక చనిపోతోన్న చాలా మంది బాధలను చూసి బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఐ (కంటి) బ్యాంక్‌ను కూడా స్థాపించారు. వీటి ద్వారా ఎంతో మందికి ప్రాణాన్ని, చూపును అందించి ప్రాణదాతగా మారారు. అలాగే, కష్ట సమయంలో విరాళాలు ఇచ్చి అండగా నిలబడ్డారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు. ఇక, ఈ మధ్యనే ఆక్సీజన్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేసి 'అన్నయ్య' అనిపించుకున్నారు.

    ఇండియాలోనే మొట్టమొదటి హీరోగా

    ఇండియాలోనే మొట్టమొదటి హీరోగా

    మెగాస్టార్ చిరంజీవి రాకముందు వరకూ ఓ మూస ధోరణిలో వెళుతోన్న డ్యాన్స్‌.. ఆ తర్వాత కొత్త పుంతలు తొక్కింది. ఎన్నో సినిమాల్లో మాస్ డ్యాన్స్‌తో మెప్పించిన ఈ హీరో.. 'పసివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరకే కాదు.. ఇండియా మొత్తానికే తొలిసారి 'బ్రేక్‌ డ్యాన్స్‌'ను పరిచయం చేశారు. ఆ తర్వాత చాలా సినిమాల వరకు ఇది కొనసాగింది. చిరు బ్రేక్ డ్యాన్స్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో లెక్కకట్టడం కష్టమనే చెప్పాలి. అంతగా అతడి గ్రేస్ చూపించారు. దాన్నే ఈ మధ్య విడుదలైన ఆచార్యలోని లాహే లాహే సాంగ్ వరకూ చూపించారు మెగాస్టార్.

    ఇలా ఎన్నో మరెన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ.. ప్రజాసేవలో ముందుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Tollywood Senior Hero Megastar Chiranjeevi Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know Rare Records of his Career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X