Happy Birthday Naga Chaitanya: ఆ బంగర్రాజే.. నవమన్మధుడిగా వచ్చాడు.. స్టైల్ అదిరింది!

అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో బ్యూటిఫుల్ మల్టీస్టారర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అక్కినేని నాగార్జున ఆ తర్వాత ఆ కథకు కొనసాగింపుగా బంగార్రాజు సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. మనం సినిమాతో అక్కినేని అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు అందర్నీ కూడా ఎంతగానో ఆకట్టుకున్న ఈ కాంబో మరోసారి విబిన్నంగా బంగార్రాజు సినిమాతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాకు సోగ్గాడు మళ్ళి వచ్చాడు అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిసి అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో నాగార్జున కెరిర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ ను అందుకున్నాడు. ముఖ్యంగా బంగార్రాజు పాత్ర అయితే జనాల్లో చాలా బలంగా పాతుకు పోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మరోసారి సంక్రాంతి నీ టార్గెట్ చేస్తూ అదే తరహాలో బంగార్రాజు సినిమాతో సక్సెస్ అందుకోవాలని నాగార్జున ప్రత్యేకంగా ప్లాన్ వేశాడు.

బంగార్రాజు సినిమా కథను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దాదాపు రెండేళ్ళ పాటు కష్టపడి రాశాడు. నాగార్జున పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరే వరకు కూడా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలి అని దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నాగార్జున కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన టీజర్ కిడా విడుదల చేశారు. అక్కినేనీ నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా జూనియర్ బంగార్రాజు వచ్చేసాడు అంట ప్రత్యేకమైన టీజర్ వదిలారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య బంగార్రాజు లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున తరహాలోనే ఇప్పుడు బంగార్రాజు సినిమాల్లో నాగచైతన్య కూడా అదే తరహా స్టైల్ తో ఎంట్రీ ఇవ్వడం విశేషం. పెద్ద కర్రను తీసుకొని స్టైల్ గా నేలకేసి కొట్టడంతో అది బుల్లెట్ బైక్ పై పడడం అద్భుతంగా ఉంది.

Happy birthday Naga chaitanya bangarraju first look

ఇటీవల లవ్ స్టోరీ సినిమాతో నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చూస్తుంటే బంగార్రాజు సినిమాతో కూడా మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్న క్లారిటీగా అర్థమవుతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమా కథలో పూర్వం భవిష్యత్తు కాన్సెప్ట్ లను జతచేసి బంగార్రాజు సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కూడా గట్టిగానే ఉంటుందట. సినిమాలో 2022 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆ సమయంలో పెద్ద సినిమాలు పోటీ గా ఉండటంతో మళ్ళీ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X