For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Nagarjuna: తెలుగులో ఆ రికార్డు నాగార్జునదే.. సినీ చరిత్రలోనే అరుదైన ఘనత సొంతం

  |

  ఏఎన్నార్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని నాగ్.. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, భక్తుడిగా, దేవుడిగా కనిపించినా అది ఈ అక్కినేని హీరోకు మాత్రమే సాధ్యమైంది.

  సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న ఈ స్టార్ హీరో.. తన సత్తాను చూపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున నేడు (ఆగస్టు 29) 62వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మీకోసం!

  చిన్నప్పుడే ఎంట్రీ.. హీరోగా అలా మొదలు

  చిన్నప్పుడే ఎంట్రీ.. హీరోగా అలా మొదలు

  రెండేళ్ల వయసులోనే ‘వెలుగు నీడలు' అనే సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు అక్కినేని నాగార్జున. ఆ తర్వాత ‘సుడిగుండాలు' అనే చిత్రానికి చైల్డ్ ఆర్టిస్టుగా చేశారు. ఈ క్రమంలోనే 1986లో ‘విక్రమ్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని నాగార్జున.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను కూడా అందుకుని టాలీవుడ్‌లో తన సత్తాను చూపించారు.

  ఆరియానాపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: అతడితో అలాంటి పనులు.. తప్పని చెప్పినా వినలేదంటూ!

  కెరీర్‌తో టాలీవుడ్‌ గతిని మార్చిన సినిమా

  కెరీర్‌తో టాలీవుడ్‌ గతిని మార్చిన సినిమా

  నాగార్జున వరుస పెట్టి సినిమాలు చేయడంతో పాటు విజయాలను కూడా అందుకున్నా.. ఎందుకో అక్కినేని అభిమానులు సంతృప్తి చెందలేదు. ఇలాంటి సమయంలోనే వచ్చింది ‘శివ'. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, అప్పటి వరకూ టాలీవుడ్‌లో పెట్టుకున్న బౌండరీలను సరిచేసి ఇండస్ట్రీ గతినే మార్చేసింది. ఈ సినిమాతో నాగార్జున పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత ఈ చిత్రం హిందీలోకి సైతం డబ్ అయింది. దీంతో నాగార్జున బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడ కూడా పలు చిత్రాలు చేశారు.

  అలా ఇలా నటించి సత్తా చాటిన నాగార్జున

  అలా ఇలా నటించి సత్తా చాటిన నాగార్జున

  సుదీర్ఘమైన కెరీర్‌లో అక్కినేని నాగార్జున ఎన్నో రకాల చిత్రాల్లో, చాలా పాత్రలు చేశారు. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించిన ఆయన.. ఆ తర్వాత పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు.

  లవర్ బాయ్‌గా నటించిన ఈ స్టార్ హీరోనే సాయి బాబాలా కూడా నటించి మెప్పించారు. తద్వారా తన యాక్టింగ్ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. తన కెరీర్‌లో ‘శివ', ‘గీతాంజలి', ‘హలో బ్రదర్', ‘అన్నమయ్య' ఇలా ఎన్నో వైవిధ్యమైన మూవీల్లో నటించి తన స్టామినాను నిరూపించుకున్నారు.

  సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

  డుయల్ రోల్.. సొంతమైన జాతీయ అవార్డ్

  డుయల్ రోల్.. సొంతమైన జాతీయ అవార్డ్

  తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన నాగార్జున.. 1979లోనే ‘కల్యాణీ' అనే సినిమాతో నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించారు. అందులో తన సినిమాలతో పాటు తండ్రి ఏఎన్నార్ చిత్రాలు, ఇతర హీరోలు చేసిన మూవీలు కూడా ఉన్నాయి. నటుడిగా ఎన్నో నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న నాగార్జున.. ‘నిన్నే పెళ్లాడతా' చిత్రానికి గానూ నిర్మాతగా జాతీయ అవార్డును దక్కించుకున్నారు. ఇలా నటుడిగా, నిర్మాతగా డయల్ రోల్ చేస్తూ ఇప్పటికే ఎన్నో చిత్రాలను అందిస్తున్నారు.

  అందులోకి అడుగు.. నేషనల్ లెవెల్ హవా

  అందులోకి అడుగు.. నేషనల్ లెవెల్ హవా

  వెండితెరపై తనదైన నటనతో అదరగొట్టేసిన కింగ్ అక్కినేని నాగార్జున.. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ' అనే షో ఆధారంగా వచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షోతో ఆయన హోస్టుగా పరిచయం అయిన ఆయన.. అందులో అదరగొట్టేశారు. ఆ తర్వాత అదే ఛానెల్‌లో వచ్చిన బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్'ను కూడా హోస్ట్ చేశారు నాగ్. మూడు, నాలుగు సీజన్లను నడిపించిన ఆయన ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్‌ను సాధించి నేషనల్ రికార్డును క్రియేట్ చేశారు. ఇలా కూడా తన టాలెంట్‌ను దేశ వ్యాప్తంగా చాటుకున్నారు.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

   సినీ చరిత్రలోనే అరుదైన ఘనత సొంతం

  సినీ చరిత్రలోనే అరుదైన ఘనత సొంతం

  దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అక్కినేని నాగార్జున.. మర్చిపోలేని ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. వాటి ద్వారా ఆయన ఎన్నో రికార్డులు, అవార్డులు కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం ‘మనం' అనే పునర్జన్మల నేపథ్యంతో వచ్చిన చిత్రంలో నటించారు. ఇందులో నాగార్జునతో పాటు ఏఎన్నార్, నాగ చైతన్య, సమంత కూడా నటించారు. అమల, అఖిల్ గెస్టులుగా కనిపించారు. ఇలా ఫ్యామిలీ మొత్తం నటించిన ఏకైక చిత్రం ఇది. ఈ సినిమాను నిర్మించిన ఘనత నాగార్జునకే దక్కింది.

  వ్యాపారాలు.. అలా కూడా నేషనల్ రేంజ్

  వ్యాపారాలు.. అలా కూడా నేషనల్ రేంజ్

  అక్కినేని నాగార్జున కేవలం సినిమాలకే పరిమితం అవలేదు. ఆ మధ్య ఓ ఛానెల్‌కు సహా భాగస్వామిగా ఉన్న ఈ స్టార్ హీరో.. ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలను మొదలు పెట్టారు. ఇందులో బాడ్మింటన్ లీగ్, ఫుల్‌బాల్ లీగ్‌లలో ఒక్కో జట్టుకు ఓనర్‌గా కూడా వ్యవహరించారు. ఇలా ఆయన దేశ వ్యాప్తంగా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ సెలెబ్రిటీలతో సత్సంబంధాలను కూడా ఏర్పరచుకుని పక్కా బిజినెస్‌మ్యాన్ అనిపించుకుంటూ దూసుకు పోతున్నారు.

  తెలుగు నటి హరి తేజ పర్సనల్ ఫొటోలు: తల్లైనా తర్వాత బోల్డుగా కనిపించిన భామ

  Bigg Boss-5 టైం విషయంలో షాకిచ్చిన స్టార్ మా.. నేటి నుంచి క్వారంటైన్ లో...!! || Filmibeat Telugu
  ఘోస్టుగా ఒకటి.. బంగార్రాజుగా మరొకటి

  ఘోస్టుగా ఒకటి.. బంగార్రాజుగా మరొకటి

  ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. దీనికి ‘ఘోస్ట్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే విడుదలై ప్రీ లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేసింది. దీనితో పాటు ఇప్పుడు నాగార్జున ‘బంగార్రాజు' అనే తన డ్రీమ్ ప్రాజెక్టులోనూ నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన'కు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఇటీవలే మొదలైన ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.

  నటుడిగా, నిర్మాతగా, హోస్టుగా చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నవ మన్మథుడు అక్కినేని నాగార్జునకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Tollywood Senior Hero Nagarjuna Akkineni Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know Rare Records of his Career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X