For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HappyBirthdayNBK: ఇండియాలో అలా చేసిన ఏకైక హీరో.. టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన బాలయ్య

  |

  నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా చిన్న వయసులోనే తనలోని సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న బాలయ్య.. ఎవరికీ సాధ్య కాని రికార్డులను క్రియేట్ చేశారు. ఇక, ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు.. రికార్డులు.. మైలురాళ్ల గురించి తెలుసుకుందాం పదండి!

   14 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు

  14 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు

  నందమూరి బాలకృష్ణ 14 ఏళ్ల వయసులోనే ‘తాతమ్మకల' అనే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అద్భతమైన నటనతో ఆకట్టుకున్నారు. తద్వారా ఉత్తమ బాల నటుడిగా అవార్డులను సైతం అందుకున్నారు. దీని తర్వాత కూడా చాలా కాలం పాటు ఎన్నో గొప్ప చిత్రాల్లో భాగం అయ్యారు. వాటిలో చాలా వరకూ ఎన్టీఆర్ తెరకెక్కించిన చిత్రాలే ఉన్నాయి.

   హీరోగా మారిన తర్వాత తగ్గడం లేదు

  హీరోగా మారిన తర్వాత తగ్గడం లేదు

  1984లో ‘సాహసమే జీవితం' అనే సినిమాతో బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది ఏకంగా ఏడు సినిమాల్లో నటించి సత్తా చాటారు. అందులో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘మంగమ్మ గారి మనవడు' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ జోష్‌లో ఏడాది ఆరు నుంచి తొమ్మిది చిత్రాల వరకూ చేసుకుంటూ వెళ్లారాయన. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటుకున్నారు.

  ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన బాలయ్య

  ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన బాలయ్య

  కెరీర్ ఆరంభంలోనే బడా దర్శకుల సినిమాల్లో నటించిన నందమూరి బాలకృష్ణ.. రాను రానూ కొత్త దర్శకులకు అవకాశం కల్పించారు. అందుకే ఆయనను దర్శకుల హీరో అంటారు. ఇలా అవకాశం ఇవ్వమంటూ వచ్చిన దర్శకులందరితో సినిమాలు చేయడం వల్ల బాలయ్య ఎన్నో ఫ్లాపులను చవి చూశారు. అయినప్పటికీ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

  Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna
   ప్రయోగాల రారాజు.. అప్పట్లోనే అలా

  ప్రయోగాల రారాజు.. అప్పట్లోనే అలా

  సుదీర్ఘమైన కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. సాంఘీకం, జానపదం, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, కమర్షియల్ వంటి ఎన్నో జోనర్లలో సినిమాలు చేశారు. మరీ ముఖ్యంగా అప్పట్లోనే ‘ఆదిత్య 369' వంటి టైమ్ మెషీన్ ఆధారంగా సినిమా చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇలా ఎన్నో విలక్షణమైన కథలతో సినిమాలు చేసిన స్టార్‌గా కితాబందుకున్నారు.

  రాజకీయాల్లోకి ప్రవేశం... ఎమ్మెల్యేగా

  రాజకీయాల్లోకి ప్రవేశం... ఎమ్మెల్యేగా

  సినిమాల పరంగా తన సత్తాను నిరూపించుకున్న బాలయ్య.. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా పని చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్కడ అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకున్న ఆయన.. 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

   సేవలోనూ తనకు తానే సాటి అంటూ

  సేవలోనూ తనకు తానే సాటి అంటూ

  కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. అందుకే క్లిష్ట సమయాల్లో తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎంతో మందికి, ఎన్నో దానాలు చేసిన ఆయన.. విపత్కర పరిస్థితుల్లో విరాళాలు కూడా అందించారు. ఇక, బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి ప్రాణాలు నిలుపుతున్నారు. ఇలా ఎన్నో సేవలు చేస్తున్నారు.

   ఇండియాలోనే ఏకైక హీరోగా ఘనత

  ఇండియాలోనే ఏకైక హీరోగా ఘనత

  సుదీర్ఘమైన ప్రయాణంలో నందమూరి బాలకృష్ణ సాధించిన రికార్డు, అందుకున్న ఘనతలు, చేరుకున్న మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. అయితే, తన తండ్రి జీవిత కథతో ఇటీవలే బయోపిక్‌ను తెరకెక్కించారాయన. ఇలా తండ్రి పాత్రలో నటించిన ఏకైక ఇండియన్ హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు. దురదృష్టవశాత్తూ రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది.

  లేటు వయసులో అదిరిపోయే రికార్డు

  లేటు వయసులో అదిరిపోయే రికార్డు

  కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలతో సత్తా చాటిన బాలయ్య.. ఈ మధ్య కాలంలో గాడి తప్పారు. దీంతో అప్పుడప్పుడూ మాత్రమే హిట్లను దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ‘అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ టీజర్ టాలీవుడ్‌ రికార్డులను బ్రేక్ చేసేసింది. దీనితో పాటు గోపీచంద్ మలినేనితోనూ ఓ సినిమాను చేయబోతున్నారాయన. ఇలా ఎన్నో మరెన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ.. ముందుకు సాగాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

  English summary
  Tollywood Senior Hero Natasimham Nandamuri Balakrishna Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know Best Moments of his Career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X