twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBDKalyanRam: చిన్నప్పుడే బాబాయ్‌తో మూవీ.. తారక్‌తో కలిసి ప్లాన్.. ఇండియాలోనే తొలి హీరోగా రికార్డ్

    |

    టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ ఫ్యామిలీకి మూలపురుషుడు నందమూరి తారక రామారావు అన్న విషయం వేరేగా చెప్పనక్కర్లేదు. ఆయన తర్వాత చాలా మంది ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత పేరును తెచ్చుకున్న హీరో కల్యాణ్ రామ్. నటుడిగా, నిర్మాతగా సినీ రంగానికి సేవలు అందిస్తోన్న అతడు.. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. ఇక, ఈరోజు కల్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని మధుర ఘట్టాలు తెలుసుకుందాం!

    చిన్న వయసులోనే బాబాయ్‌తో మూవీ

    చిన్న వయసులోనే బాబాయ్‌తో మూవీ

    ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ వారసుడే నందమూరి కల్యాణ్ రామ్. ప్రస్తుతం హీరోగా, ప్రొడ్యూసర్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలో వెలుగొందుతోన్న అతడు.. చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేశాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన 'బాల గోపాలుడు' అనే సినిమాలో కల్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. అప్పుడే తన యాక్టింగ్ సత్తాను చూపించాడు.

    హీరోగా పరిచయం.. మూడో సినిమాతో

    హీరోగా పరిచయం.. మూడో సినిమాతో

    2003 వచ్చిన 'తొలి చూపులోనే' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నందమూరి కల్యాణ్ రామ్. అయితే, ఈ చిత్రం మాత్రం నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత 'అభిమన్యు' అనే సినిమానూ చేశాడు. అది కూడా ఫ్లాప్‌ అయింది. ఈ క్రమంలోనే మూడో సినిమాగా వచ్చిన 'అతనొక్కడే'తో నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

     వరుస ఫ్లాపులు... ‘పటాస్'తో మారింది

    వరుస ఫ్లాపులు... ‘పటాస్'తో మారింది

    'అతనొక్కడే' తర్వాత కల్యాణ్ రామ్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ, 'లక్ష్మీ కల్యాణం', 'కత్తి' వంటి సినిమాలు పేరు తెచ్చినా.. అవేమీ అతడికి భారీ హిట్‌ను అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'పటాస్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రం అతడిలోని కామెడీ యాంగిల్‌ను కూడా చూపించింది. అలాగే, కలెక్షన్లనూ భారీగా రాబట్టింది.

    మళ్లీ అదే తీరు... సక్సెస్ కోసం నిరీక్షణ

    మళ్లీ అదే తీరు... సక్సెస్ కోసం నిరీక్షణ

    'పటాస్' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, అవి ఈ హీరోకు సక్సెస్‌ను మాత్రం అందించడం లేదు. ఈ క్రమంలోనే పంథాను మార్చుకుని వైవిధ్యమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడతను. కానీ, ఫలితం మాత్రం పెద్దగా దక్కడం లేదు. దీంతో విజయం కోసం మరింతగా నిరీక్షించాల్సి వస్తోంది.

    నిర్మాతగా మారాడు.. తారక్‌తో ప్లాన్ చేసి

    నిర్మాతగా మారాడు.. తారక్‌తో ప్లాన్ చేసి

    కెరీర్‌లో మొదటి విజయాన్ని అందించిన 'అతనొక్కడే' సినిమాతో కల్యాణ్ రామ్ నిర్మాతగానూ మారాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి ఎన్నో సినిమాలు నిర్మించాడు. తన చిత్రాలే కాదు రవితేజతో 'కిక్2', ఎన్టీఆర్‌తో 'జై లవ కుశ' వంటి సినిమాను నిర్మించాడు. అంతేకాదు.. ఇకపై జూనియర్ ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాకూ అతడే సహా నిర్మాతగానూ వ్యవహరించబోతున్నాడు.

     ఇండియాలోనే తొలి హీరోగా కల్యాణ్ రికార్డ్

    ఇండియాలోనే తొలి హీరోగా కల్యాణ్ రికార్డ్

    నందమూరి కల్యాణ్ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడు. అందులో 'ఓం 3D' ఒకటి. ఈ చిత్రంలో హీరోగా చేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడతను. ఇక, ఇది ఇండియాలోనే మొట్టమొదటి త్రీడీ యాక్షన్ ఫిల్మ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే, ఈ చిత్రం మాత్రం నిరాశనే మిగిల్చింది. దీని తర్వాత కూడా కల్యాణ్ ఎన్నో సరికొత్త ప్లాన్లతో ముందుకొచ్చాడు.

    Recommended Video

    Star Director Bobby Launches Jagadananda Karaka Movie ​| Filmibeat Telugu
    వరుస సినిమాలతో కల్యాణ్ దూకుడు

    వరుస సినిమాలతో కల్యాణ్ దూకుడు

    ప్రస్తుతం కల్యాణ్ రామ్ 'బింబిసారా' అనే చారిత్రక చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మోషన్ టైటిల్ వీడియో విడుదలైంది. ఇందులో శవాల మీద కత్తి పట్టుకుని కూర్చుని కనిపించాడతను. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు దీన్ని తీస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు మైత్రీ సంస్థతో ఒకటి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మరో సినిమాను చేస్తున్నాడు కల్యాణ్ రామ్. నటుడిగా, నిర్మాతగా సక్సెస్‌లు అందుకుంటూ.. కలకాలం తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ.. ఫిల్మీబీట్ తరపున నందమూరి కల్యాణ్‌ రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Tollywood Hero, Producer Nandamuri Kalyan Ram Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know Rare Records of his Career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X