twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియాలో ఏ స్టార్‌కూ దక్కని ఫీట్.. నందమూరి అభిమానుల సత్తా.. దటీజ్ యంగ్ టైగర్

    |

    కాలంతో పాటు రికార్డులు మారుతుంటాయి. రికార్డులకు ఉన్న అర్థం మారుతూ ఉంటుది. ఒకప్పుడు ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్లు అని లెక్కులు హీరో స్థాయిని చాటి చెప్పేవి. అయితే కాలంలో వచ్చిన మార్పుల కారణంగా అవి కాస్తా సైడ్ అయిపోయాయి. ఎన్ని కోట్లు వసూల్ చేశాయ్. ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్, ఇలాంటి లెక్కలతో స్టార్ స్టేటస్‌ను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. అయితే దీంట్లోనూ భారీ మార్పులు వచ్చేశాయ్. ఇప్పుడున్నది సోషల్ మీడియా యుగం. లైకులు, వ్యూస్‌లు, ట్వీట్స్‌లతో రికార్డులను కొలుస్తున్నారు.

    Recommended Video

    #HappyBirthDayNTR Hashtag India Wide Top Trending With 21 Million Tweets, Creates Record
     బర్త్ డేల ట్రెండ్స్..

    బర్త్ డేల ట్రెండ్స్..

    హీరోల పుట్టిన రోజులంతే ఫ్యాన్స్‌కు పండగే. గతంలో అయితే రాష్ట్రమంతటా సేవాకార్యక్రమాలు, అన్నదానాలు చేసేవారు. ఇప్పుడైతే వాటితో పాటు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. కామన్ డీపీలు, ట్వీట్స్ ట్రెండింగ్స్ అంటూ దుమ్ములేపుతున్నారు. ఎవరి హీరో సత్తాను వారి వారి ఫ్యాన్స్ చాటుతున్నారు.

    ట్రెండింగ్ వార్..

    ట్రెండింగ్ వార్..

    ట్విట్టర్ ప్రపంచంలో అత్యధిక ట్వీట్లు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యేట్టు చేస్తుంటారు. ఈ మేరకు వారి హీరోల స్టామినాను అందరికీ పరిచయం చేస్తుంటారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ట్వీట్ల యుద్దం చేస్తుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని తెలిసేలా ట్రెండ్ చేస్తుంటారు.

    ఎన్టీఆర్ బర్త్‌డేకు సోషల్ మీడియా షేక్..

    ఎన్టీఆర్ బర్త్‌డేకు సోషల్ మీడియా షేక్..

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. యంగ్ టైగర్ ఫ్యాన్స్ దెబ్బకు ట్విట్టర్ ప్రపంచం అట్టుడికిపోతోంది. ఇప్పటి వరకు ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డులను క్రియేట్ చేశారు నందమూరి అభిమానులు. ఫాస్టెస్ట్ మిలియన్ ట్వీట్ల రికార్డులను ఆల్రెడీ లేపేశారు. తాజాగా మరో రికార్డును క్రియేట్ చేశారు.

     21 మిలియన్ల ట్వీట్స్..

    21 మిలియన్ల ట్వీట్స్..

    కామన్ డీపీ, అడ్వాన్స్ బర్త్ డే, బర్త్ డే ట్రెండ్, ఇలా అన్నింట్లోనూ రికార్డులు క్రియేట్ చేశారు నందమూరి ఫ్యాన్స్. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మొత్తం 21.5 మిలియన్ల హ్యాష్ ట్యాగ్‌లు హల్చల్ చేశాయి. ఈ ఫీట్ ఇంత వరకు ఇండియాలోని ఏ హీరోకూ సాధ్యం కాలేదు. ఏది ఏమైనా యంగ్ టైగర్ రేంజ్ వేరని మరోసారి నిరూపించారు.

    English summary
    Happy Birth Day NTR Hash tag top trendin in India wide. #HappyBirthDayNTR gets 21 million tweets. no Other Indian Star Heroes Have This Recored.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X