HBD NTR: రాముడి నుంచి దేవర వరకూ.. ఎన్టీఆర్ సంచలన రికార్డు.. అతడి ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలిస్తే!
సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లోకి ఎంటరైనా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే రికార్డులపై దండయాత్రను ప్రారంభించిన అతడు.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ వరుసగా విజయాలను అందుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ నేపథ్యంలో నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా అతడి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం!
రాముడిగా.. నేషనల్ అవార్డ్:సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' అనే సినిమాతో 8 ఏళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అంటే 13 ఏళ్ల వయసులో 'బాల రామాయణం' అనే సినిమాలో రాముడిగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. అదే సమయంలో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది.

హీరోగా ఎంట్రీ తారుమారుగా:వాస్తవానికి ఎన్టీఆర్ 'స్టూడెంట్ నెం1' అనే సినిమాతో హీరోగా పరిచయం కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల అది ఆలస్యం అవడంతో.. 'నిన్ను చూడలని' అనే సినిమా ముందుగా విడుదలైంది. ఈ చిత్రం నిరాశ పరచగా.. రాజమౌళి తెరకెక్కించిన 'స్టూడెంట్ నెం1' మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆలస్యంగా వచ్చినా ఇది అతడిని నిలబెట్టేసింది.

భారీ హిట్లు.. వరుస ఫ్లాపులు:ఎన్టీఆర్‌కు మొదట్లోనే 'స్టూడెంట్ నెం1', 'ఆది' వంటి హిట్లు వచ్చాయి. దీంతో అతడికి మాస్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన 'సింహాద్రీ' ఇండస్ట్రీ హిట్ అయింది. దీని తర్వాత 'యమదొంగ' వచ్చే వరకూ వరుస ఫ్లాపులను చవి చూశాడు. ఆ సమయంలోనూ అతడు ఏమాత్రం బ్యాక్ స్టెప్ వేయలేదు.

పాన్ ఇండియా రేంజ్‌కు:'యమదొంగ' తర్వాత ఎన్టీఆర్ ఎన్నో ఫ్లాపులు చూశాడు. ఈ పరిస్థితుల్లో 'టెంపర్'తో అతడు మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ', RRR వంటి హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. అదే సమయంలో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ను కూడా అందుకున్నాడు.

దేవరగా.. క్రేజీ కాంబోలతో:RRRతో పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్.. ఇప్పుడు వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే కొరటాల శివతో 'దేవర' అనే సినిమాను చేస్తోన్న తారక్.. ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమాను సెట్ చేసుకున్నాడు. వీటితో పాటు బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో కూడా నటిస్తాడు. అలాగే, వెట్రిమారన్ సహా పలువురు దర్శకులతోనూ సినిమాలు చేయనున్నాడు.

ఎన్టీఆర్ ఆస్తులు విలువ:జూనియర్ ఎన్టీఆర్ నికర విలువ దాదాపు రూ. 450 - 500 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే, అతడు గతంలో ఒక్కో సినిమాకు రూ. 40 - 50 కోట్లు చార్జ్ చేసేవాడు. అయితే, ఇప్పుడు మాత్రం రూ. 100 - 150 కోట్లు తీసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కు రూ. 80 కోట్లు విలువైన ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉన్నట్లు ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది.

ఇల్లు, కార్లు రేట్ ఎంతంటే:ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌లో ఓ విలాసవంతమైన భవనం ఉంది. దీని విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందట. వేరే ప్రాంతాల్లో ఇల్లు, స్థలాలు కలిపి రూ. 50 కోట్లు విలువ చేస్తాయని తెలిసింది. అలాగే, ప్రస్తుతం అతడు వాడుతోన్న కార్లు ఇతర యాక్సిసిరీస్‌ల విలువ రూ. 15 - 20 కోట్లు ఉంటుందట. అలాగే, వాచ్‌లు అంటే ఇష్టమున్న తారక్‌కు రూ. 10 కోట్లు విలువైనవి ఉన్నాయట.
కొంత కాలంగా సక్సెస్‌కు చిరునామాలా మారిన ఎన్టీఆర్.. మరిన్ని విజయాలను అందుకోవాలని.. తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











