twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday NTR: 19 ఏళ్లకే సూపర్‌స్టార్‌గా.. టాలీవుడ్‌కు టార్చ్ బేరర్‌లా

    |

    నందమూరి వంశం అనే ట్యాగ్ ఉన్నప్పటికీ.. వెండితెరపై నటుడిగా రాణించాలనే ఎన్నో కలలతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన సాధారణ యువకుడు జూనియర్ నందమూరి తారక రామారావు. అవకాశాల కోసం అందరిలానే దర్శక, నిర్మాతలను కలుస్తూ తన కలల పంటను పండించేందుకు అహర్నిశలు శ్రమించారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని విజయంగా మలుచుకొనేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో సినిమా సినిమాకు తన రేంజ్‌ను పెంచుకొంటూ స్టార్ హీరోగా, యంగ్ టైగర్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం మే 20. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి..

    Recommended Video

    #HappyBirthdayNTR: Young Tiger NTR Movie Journey| Wishes Pour in On Twitter
    సీనియర్ ఎన్టీఆర్‌తో జూనియర్ ఎన్టీఆర్

    సీనియర్ ఎన్టీఆర్‌తో జూనియర్ ఎన్టీఆర్

    వాస్తవానికి బాల నటుడిగా విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌తో బ్రహ్మర్షి విశ్వామిత్ర, గుణశేఖర్ రూపొందించిన రామాయణంతో ఎన్టీఆర్ నట జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత రామోజీరావు రూపొందించిన నిన్ను చూడాలని అనే చిత్రంతో హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్‌కు మిశ్రమ ఫలితాలు పలకరించాయి. హిట్లు, ఫ్లాపులో ఎన్టీఆర్ కెరీర్ ఆటుపోట్లకు గురైంది. ఈక్రమంలో స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్లు పలకరిస్తే.. సుబ్బు, అల్లరి రాముడు, ఆంధ్రావాలా, సాంబా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ లాంటి ఫ్లాపులు బెదరగొట్టాయి.

    టీనేజ్‌లోనే సంచలనాలతో

    టీనేజ్‌లోనే సంచలనాలతో

    ప్రతీ తరంలో ఓ కొత్త ఒరవడితో ఓ రంగానికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తులు పుడుతారు. వారినే టార్చ్ బేరర్ అంటారు అనే సినిమా డైలాగ్ సరిపోయినట్టు ఎన్టీఆర్ జీవితం ఆవిషృతమవుతున్నది. 18 ఏళ్లకే సూపర్ హిట్, 19 ఏళ్లకే స్టార్ హోదా, 25 ఏళ్ల వయసులో మృత్యువును ఎదురించిన తీరు, రాజకీయ ప్రవేశం లాంటి అంశాలు ఎన్టీఆర్ జీవితంలో భావోద్వేగానికి గురిచేసే అంశాలుగా కనిపిస్తాయి.

    వరుస విజయాలతో

    వరుస విజయాలతో

    ఓ దశలో వరుస ఫ్లాపులతో తడబాటు గురైన ఎన్టీఆర్ తానేంటి? తన అభిమానులు ఏం కోరుకొంటున్నారు. ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తున్నారనే విషయాలను బేరిజు వేసుకొన్న యంగ్ టైగర్‌కు ఈ మధ్య కాలంలో ఎదురే లేకుండా పోయింది. టెంపర్ తర్వాత, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత చిత్రాలు ఆయన బాక్సాఫీస్ స్టామినాకు మచ్చు తునకగా మారాయి.

    ఎన్టీఆర్ కొత్త సినిమాలు

    ఎన్టీఆర్ కొత్త సినిమాలు

    RRR (రౌద్రం,రణం, రుధిరం) చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ ప్రాజెక్ట్ (అయిననూ హస్తినకు పోయి రావలె), అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌కు టార్చ్ బేరర్‌గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు వారికి కూడా టార్చ్ బేరర్ కావాలని ఆశిద్దాం.

    English summary
    Tollywood's Young Tiger NTR is celebrating his birthday on May 20th. In this occassion, The filmibeat Telugu is bringing exclusive review for Readers. NTR's life journey in a nutshell. సినిమా సినిమాకు తన రేంజ్‌ను పెంచుకొంటూ స్టార్ హీరోగా, యంగ్ టైగర్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం మే 20. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X