twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆయన పేరు చెపితే బాక్సాఫీస్ బాక్స్‌లు బద్దలు అవుతాయి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆయన సినిమా చూడాలన్న ఆసక్తి కలిగి భీభత్సమైన ఓపినింగ్స్ వస్తాయి. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు టాలీవుడ్‌ని ఏలుతున్న హీరోల్లో నెంబర్ 1.

    ఈ రోజు పవన్ పుట్టిన రోజు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిన పవన్ కళ్యాణ్ హిట్, ప్లాప్ లతో సంభంధం లేని స్టార్ హీరోగా ఎదిగారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'సుస్వాగతం', 'బద్రి' మరియు 'ఖుషి' చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాదించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ కి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు ఫ్యాన్స్ కు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.

    చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన స్టయిల్‌తో యువతరం అభిమాన హీరోగా మారి, 'ఖుషి'తో అనూహ్యమైన క్రేజ్‌నూ, ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సాహిత్యాభిమాని కూడా అయిన కల్యాణ్‌లో ఉన్న సృజనాత్మక శక్తి ఆయనను దర్శకత్వం వైపు మళ్లించింది.

    టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ విభిన్నమైనది. పవన్ కళ్యాణ్ క్రేజ్ కు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేదు. పవన్ సినిమాకు ఉన్న స్టామినా, రేంజ్ చాలా ఎక్కువే. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలే అందుకు నిదర్శనం. తెలుగు చలన చిత్ర సీమలో ఎవరికీ దక్కనటువంటి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జన్మదినం(సెప్టెంబర్ 2) సందర్భంగా వన్ ఇండియా శుభాకాంక్షలు తెలుపుతోంది.

    జల్సా మళ్లీ

    జల్సా మళ్లీ

    'జానీ'తో దర్శకుడుగా మారిన ఆయనకు బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగిలినప్పుడు, చాలా కాలం సరైన విజయం ఆయన ఖాతాలో లేనప్పుడు రేసులో కల్యాణ్ వెనుకపడ్డాడని అన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఇలాంటి స్థితిలోనూ ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని 'జల్సా' నిరూపించింది.

    గబ్బర్ సింగ్ స్టామినా

    గబ్బర్ సింగ్ స్టామినా

    'జల్సా' తర్వాత వచ్చిన మూడు సినిమాలు సరిగా ఆడకపోయినా 'గబ్బర్‌సింగ్'తో ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో అందరికీ అర్థమైపోయింది. వసూళ్ల లెక్కల సంగతి అలా ఉంచినా, ఆ సినిమా కల్యాణ్‌కిచ్చిన ఇమేజ్ సామాన్యమైంది కాదు. ఆయన పేరు వింటేనే యువతరం వెర్రెత్తిపోయేంత ఇమేజ్‌ను ఆ సినిమా ఇచ్చింది. అది రీమేక్ సినిమానే కావచ్చు కాక, అయితేనేం 'గబ్బర్‌సింగ్'ను ఓ బ్రాండ్‌గా మార్చేశాడు కల్యాణ్.

    గబ్బర్ సింగ్-2

    గబ్బర్ సింగ్-2

    అలాగే... మరోమారు ‘గబ్బర్‌సింగ్'లా పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం దర్శకుడు సంపత్‌నంది అద్భుతమైన కథ తయారు చేశారని సమాచారం. ఈ రెండు సినిమాలతో అభిమానులను ఓ రేంజ్‌లో ‘ఖుషీ' చేయనున్నారు పవర్‌స్టార్.

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్

    రమణ మహర్షి పుస్తకాలు పవన్‌పై చాలా ప్రభావం చూపించాయి. తొలి దశలో షాడో నవలల్ని బాగా చదివేవారు. ఆ తరవాత చలం భావాలూ నచ్చాయి. దేవుడంటే నమ్మకం ఉంది. కానీ విగ్రహారాధనపై కాదు. పూజలు చేయరు. కానీ ఉపవాసాలు ఉంటారు. 'ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడూ ఖాళీ కడుపుతో పడుకోవడం మంచిది. దానికి మనం పెట్టుకొన్న పేరు ఉపవాసం' అంటుంటారు.

    ఆలోచనా విధానం

    ఆలోచనా విధానం

    తన ఆలోచనల్ని తన సినిమాలో సన్నివేశాలుగా, పాటలుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. 'ఐ యామ్‌ యాన్‌ ఇండియన్‌' (బద్రి), 'లే లే లేలే ఇవ్వాళే లేలే' (గుడుంబా శంకర్‌), యే మేరా జహా (ఖుషి) పాటలే అందుకు నిదర్శనం.

    సున్నితమైన మనసు

    సున్నితమైన మనసు

    తన కళ్లముందు జరిగే చిన్న చిన్న సంఘటనలకు కూడా కదిలిపోతుంటారు. ధైర్యం వదిలిన రాకెట్టులా దూసుకుపోతుంటారు. 'కామన్‌మేన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌' పెట్టడానికి కారణం అదే. తొలి విరాళంగా తన వంతు రూ.కోటి అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

    పవన్ ఆవేశం

    పవన్ ఆవేశం

    అన్నయ్య స్థాపించిన పీఆర్పీకి మద్దతుగా జరిపిన ప్రచారంలో, ఆ తర్వాత జన సేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్‌ చేసిన ప్రసంగాలు ఆయన ఆవేశానికి అద్దం పట్టాయి. సమాజం పట్ల ఆయనకున్న దృక్ఫథం అర్థమవుతుంది.

    అభిమానులు

    అభిమానులు

    తన వ్యక్తిత్వ లక్షణాలతోనే లెక్కలేనంతమంది అభిమానుల్ని సంపాదించుకొన్నారు పవన్‌. సినిమా రంగంలోనూ పవన్‌కి వీరాభిమానులు ఉన్నారు. 'పవన్‌కి అభిమానులంటూ ఉండరు. ఉన్నవాళ్లంతా భక్తులే' అని చెప్తుంటారు హరీష్‌ శంకర్‌.

    పవన్-అలీ

    పవన్-అలీ

    పవన్‌ - అలీ మధ్య ఉన్న బంధం మరీ ప్రత్యేకమైనది. 'మీ అందరికీ తెలిసిన పవన్‌ వేరు, బయటి పవన్‌ వేరు. ఆ తేడా నన్నెంతో ఆకట్టుకొంది. ఆయన వ్యక్తిత్వానికి నేను కూడా సలామ్‌ చేస్తా' అని అలీ చెబుతున్నారు.

    నితిన్

    నితిన్

    'పవన్‌ సినిమాలో ఒక్కసారి కనిపిస్తే చాలు..' అనేంత అభిమానం నితిన్‌ది. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో పవన్‌పై తనకున్న ప్రేమను చాటుకొన్నారాయన. ఆయన తన తర్వాత చిత్రానికి టైటిల్ గా కొరియర్ బోయ్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు.

    పవన్ స్టైల్

    పవన్ స్టైల్

    నాక్కొంచెం తిక్కుంది...కానీ దానికో లెక్కుంది' ఇది ‘గబ్బర్‌సింగ్'లో పవన్‌కల్యాన్ చెప్పిన డైలాగ్. అయితే ఈ డైలాగ్ పవన్‌కు కరెక్ట్‌గా సరిపోతుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి మాట. ఎందుకంటే ఎవ్వరు ఎన్ని చెప్పినా అతని పంథా అతనిదే కాబట్టి. నలుగురిని ఫాలోకావడం...నలుగురిలా వుండటం అతనికి నచ్చని స్టైల్. ఈ స్టైలే అతన్ని టాలీవుడ్‌లో పతాకస్థాయికి చేర్చింది.

    ప్రయోగాలు

    ప్రయోగాలు

    ఆది నుంచి ప్రయోగాలు చేయడమే అతని స్టైల్. మూసలో కొట్టుకుపోకూడదు. ఏదైనా ప్రేక్షకులకు కొత్తగా చెప్పాలి, కొత్తగా చూపించాలి అని నిత్యం తపన పడే వ్యక్తి పవన్‌కల్యాణ్. అతనితో పనిచేసిన ప్రతి దర్శకుడు అనే మాట ఇది. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూనే తన సినిమాలతో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికాడు పవన్‌కల్యాణ్. దానికి నిదర్శనమే ‘తమ్ముడు' చిత్రంలో పవన్‌పై చిత్రీకరించిన ‘ట్రా సోల్జర్'... సాంగ్. ఇంగ్లీష్ పాటని తొలిసారి తెలుగు సినిమాలో పెట్టి ప్రేక్షకులని ఒప్పించిన ఘనత పవన్‌దే. అలాగే ‘ఖుషీ' సినిమాలోనూ ఇదే తరహా ప్రయోగం చేశారాయన. అయితే ఈ సారి హిందీ పాటని తీసుకుని ప్రయోగం చేయడం విశేషం. ‘యే మేరా జహా...యే ఘర్ మేరా ఆషియా..అంటూ పవన్ చేసిన ప్రయోగం ఇండస్ట్రీ వారందరిచేత ఔరా అనిపించింది.

    జానీ

    జానీ

    ఇక వీటి తరువాత పవన్ చేసిన మరో ప్రయోగం ‘జానీ'. పవన్ తొలిసారి దర్శకుడిగా మారి రెగ్యులర్ పంథాకు భిన్నంగా చేసిన ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించకపోయింది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో అన్న చాటు తమ్ముడిగా కెరీర్ ప్రారంభించిన పవన్ 21 సినిమాల ప్రయాణంలో సాధించిన స్టార్‌డమ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా ఫరవాలేదంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే స్థాయికి చేరుకుంది.

    కలెక్షన్స్ ఫుల్

    కలెక్షన్స్ ఫుల్

    ఇక హిట్ అన్న టాక్ తోడయితే ఆ సినిమాని పట్టుకోలేం. జయాపజయాలకు సంబంధంలేని మార్కెట్ పవన్ సొంతం. ఇది ట్రేడ్ వర్గాలు బహిరంగంగా చెప్పే మాట. ప్రస్తుతం ఆయన గోపాలా గోపాలా చిత్రంలో నటిస్తున్నాడు.

    నిరాడంబరంగా

    నిరాడంబరంగా

    పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ఇంటికి వెళ్లిన వారిని కూడా చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడా తాను ఓ పెద్ద స్టార్ ని అనే గర్వం కనపడదు అని చెప్తారు. ఫ్యాన్స్ ఆయన్ని ఇంటివద్ద కలుస్తూంటారు.

    పవనిజం

    పవనిజం

    పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవనిజం' కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘పవనిజం' టైటిల్ తో ఓ చిత్రం మొదలైంది. పవన్‌కల్యాణ్ అభిమానులు అనుకుంటే సమాజంలో చాలా మార్పులు వస్తాయి అనే కథతో తెరకెక్కుతున్న తాజా సినిమా 'పవనిజం'.

    English summary
    Pawan Kalyan Birthday (sep 02). Pawan Kalyan is an Indian film actor, director, screenwriter, and politician. His film works are predominantly in Telugu cinema. He is the younger brother of actor turned politician Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X