Happy Birthday Pawan Kalyan: ఇంటి పెద్ద బిడ్గగా కల్యాణ్ బాబు.. చిరంజీవి,రాంచరణ్, సాయిధరమ్ ఎమోషనల్ విషెస్
పవర్ స్టార్, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన 53వ పుట్టిన రోజును అభిమానులు ఘనంగా జరుపుకొంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తుఫాను, వరద పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడంతో తన జన్మదినాన్ని నిరాడంబరంగా నిర్వహించుకోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు అందిస్తూ పండగలా చేసుకొంటున్నారు. అయితే తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేసిన పోస్టు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ తన సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కళ్యాణ్ బాబు... ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐❤️❤️ దీర్ఘాయుష్మాన్ భవ! అంటూ చిరంజీవి విషెస్ అందించారు.
ఇక రాంచరణ్ తన బాబాయ్‌కి శుభాకాంక్షలు అందిస్తూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పుట్టిన రోజున సంతోషంగా జరుపుకోవాలని కోరుకొంటున్నాను. మీ బలం, మీ అంకిత భావం, మీ తపన ఎప్పుడూ నాకు మాత్రమే కాదు.. అందరికి స్పూర్తిని రగిలిస్తుంటాయని అనుకొంటాను. మీలో నిస్వార్థం, మీ నాయకత్వ పటిమ, ప్రజల కోసం, సామాజిక న్యాయం, మీరు చూపించే అంకిత భావం అద్బుతం. ఏపీలోని నిరుపేద కుటుంబాల కోసం మీరు చేస్తున్న కృషి అమోఘం. మీకు మరింత బలాన్ని కల్పించాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని అన్నారు.
కల్యాణ్ మామకు హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.. నా సేనాని, నా మామ, నా గురువు పవన్ కల్యాణ్ మామ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమ, ఆరోగ్యంతో ఉండాలి. అలాగే ప్రజల కోసం చేసే సేవలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి మరింత బలం ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని అన్నారు. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరికి స్పూర్తిదాయకంగా ఉండాలని కోరుకొంటున్నాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











